పంజాలో పదును పోయిందిగా
X
ఉప్పెనతో తెలుగు తెరకు పరిచయమై.. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. మెగా క్యాంప్ నుంచి వచ్చాడు కాబట్టి అరంగేట్రం హడావిడీగానే సాగింది. ఫస్ట్ మూవీ 100 కోట్లు కొల్లగొట్టడం కుర్రాడు కాస్త ప్రామిసింగ్ గా కనిపించడంతో కుర్రాడు తనకంటూ ఓ స్టార్డమ్ తెచ్చుకుంటాడు అనుకున్నారు. బట్ ఆ పరిస్థితులేం లేవు అని తర్వాత వరుసగా మూడు సినిమాలు ప్రూవ్ చేశాయి. ఉప్పెన తర్వాత వచ్చిన కొండపొలం డిజాస్టర్. అటుపై తన ఏజ్ గ్రూప్ కు తగ్గ కథగా చేసిన రంగరంగ వైభవంగా మరో డిజాస్టర్ అయింది. దీంతో ఈ సారి గేర్ మార్చి మాస్ యాక్షన్ అంటూ ఈ శుక్రవారం ఆదికేశవగా వచ్చాడు. బట్ ఈ మూవీ ట్రైలర్ కే చాలామందికి రిజల్ట్ తెలిసిపోయింది. పోనీ సినిమాలో ఇంకేదైనా బెటర్ ఎలిమెంట్ ఉంటుందేమో అనుకున్నారు. కానీ సినిమా చూశాక కుర్రాడు ఎంత రాంగ్ స్టెప్ వేశాడో అర్థమవుతుంది.
ఆదికేశవ కంప్లీట్ గా అవుట్ డేటెడ్ సినిమా. ఇప్పటికే ఎన్నోసార్లు వెండితెరపై చూసిన ఫ్యాక్షన్ డ్రామా. దీనికి తోడు వైష్ణవ్ రేంజ్ కు మించిన యాక్షన్, ఫైట్లు ఉండటంతో అది ఇంకా మైనస్ గా కనిపిస్తోంది. పోనీ ఈ యాక్షన్ కు తగ్గ కథ, కథనాలున్నాయా అంటే అదీ లేదు. దర్శకుడికి పూర్తిగా బోయపాటి శ్రీను ఆవహించాడా అన్నట్టుగా అర్థం పర్థం లేని సీన్స్, ఫైట్స్ తో రక్తపాతం సృష్టించాడు. దీంతో వైష్ణవ్ కు మరో డిజాస్టర్ తప్పలేదు. ఈ సినిమా ఎంత దారుణంగా ఉందంటే.. మెగా ఫ్యాన్స్ మినిమం కూడా పట్టించుకోలేదు. మొత్తంగా అన్న సాయితేజ్ ను మించిన రేంజ్ కు వెళతాడు అనుకుంటే అల్లు శిరీష్ రేంజ్ కు కూడా చేరుకునేలా లేడీ కుర్రాడు.