డాక్టర్ అయ్యేందుకు ఎగ్జామ్ రాసిన పవిత్రా లోకేష్.. తోడుగా నరేష్
X
టాలీవుడ్ ట్రెండింగ్ జంట నరేష్, పవిత్రా లోకేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా మళ్ళీ పెళ్లి అనే సినిమా తీసి టాలీవుడ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది ఈ జంట. ఇప్పడు ఆ జంటకి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణాది భాషల్లో నటిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర బేసిగ్గా శాండిల్ వుడ్‌కి చెందిన వ్యక్తి. ఆమె తన మాతృ భాష అయిన కన్నడలో పీహెచ్‌డీ చేయాలనుకున్నారు. అందుకోసం ఎగ్జామ్ రాయటానికని బళ్ళారి వెళ్లారు. ఆమెతో పాటు నరేష్ కూడా బళ్ళారి వెళ్లి ఆమె పరీక్ష రాసేంత వరకు అక్కడే ఉండటం అనే విషయం బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మాతృభాషలో పీహెచ్‌డీ చేయాలనుకోవటం గొప్ప విషయమంటూ.. గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
నరేష్, పవిత్రా లోకేష్‌లు పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది తెలియటం లేదు. మళ్ళీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ సమయంలోనూ ఈ విషయాన్ని అడిగితే నరేష్ చాలా తెలివిగా సమాధానం చెప్పారు. పెళ్లి అంటే రెండు హృదయాలు కలయిక అని, ఆ కోణంలో చూస్తే తమ హృదయాలు ఎప్పుడో కలిశాయని చెప్పారు. ఇద్దరు మేజర్స్ మనసులు కలిస్తే.. వారిద్దరూ కలిసి ఉండొచ్చునని, దానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదని కోర్టే చెప్పిందని తమ సినిమా ద్వారా చెప్పి తమ రిలేషన్ షిప్ తన అభిప్రాయాన్ని బలంగానే సినిమా ద్వారా చెప్పేశారు నరేష్.. పవిత్రా లోకేష్. మరో వైపు నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి తాను అసలు నరేష్‌కు విడాకులు ఇవ్వదలుచుకోలేదని చెప్పేసింది. నరేష్ మాత్రం విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. మరి ఈ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి మరి.