పోలీస్ లుక్‌లో అదరగొట్టిన పవన్.. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మూత్రీ మూవీస్ మేకర్స్ వారు దీనిని రూపొందించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈమూవీలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తమిళంలో విజయ్ నటించిన థేరి సినిమాకు రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కింది. అప్పట్లో గబ్బర్ సింగ్ ఓ రేంజ్‌లో హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది. ఇప్పుడు అదే స్టైల్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుంది. ఇందులో పవన్ రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. పోలీస్ లుక్‌లో పవన్ అదరగొట్టారు.
టీజర్‌లో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. పొలిటికల్ డైలాగ్స్ పేలాయి. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్‌ను ఓ సీన్‌లో చూపించి.. గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం..అని చెప్పే డైలాగ్ జనసైనికులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. జనసైనికులతో ఆ డైలాగ్ కచ్చితంగా విజిల్స్ వేయిస్తుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ జనసేన క్యాడర్‌కు బూస్ట్ ఇచ్చేట్లుగా ఉంది.