Home > సినిమా > మామా అల్లుళ్ల సినిమాకు మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్

మామా అల్లుళ్ల సినిమాకు మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్

మామా అల్లుళ్ల సినిమాకు మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్
X

పవన్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ బ్రో. శుక్రవారం రిలీజైన ఈ మూవీ అదరగొట్టే కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద పవన్ స్టామినా చూపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే 75 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. మూడో రోజు వంద కోట్ల క్లబ్లో చేరినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అతితక్కువ సమయంలోనే వందకోట్లు కలెక్ట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇంతకుముందు పవన్ నటించిన 5సినిమాలు వంద కోట్లు కొల్లగొట్టాయి. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది,వకీల్ సాబ్, భీమ్లానాయక్, కాటమరాయుడు సినిమాలు వంద కోట్ల క్లబ్బులో చేరాయి. ఇప్పుడా లిస్ట్లో బ్రో కూడా చేరింది. బ్రో మూవీకి 98కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమాకు 100 కోట్లు వస్తేనే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు గట్టెక్కుతారు అని భావించగా.. మూడు రోజుల్లోనే ఆ ఫీట్ను అందుకుంది.

ఈ మూవీకి టిక్కెట్ రేట్లు పెంచలేదు. నార్మల్ బడ్జెట్తో తీశామని.. అందుకే రేట్లు పెంచలేదని నిర్మాతలు చెప్పారు. కాగా బ్రో సినిమా.. మూడేళ్ల క్రితం విడుదలైన వినోదయ సిత్తం అనే తమిళ చిత్రానికి ఇది రిమేక్. అయితే పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్లో చాలా మార్పులు చేశారు. మార్క్ క్యారెక్టర్ను ఆటపట్టిస్తూ పవన్ కల్యాణ్ చేసే హంగామా సినిమాకు హైలైట్గా నిలిచిందని టాక్. ఈ మూవీని సముద్రఖని డైరెక్ట్ చేయగా.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించారు. కేతికా శర్మ హీరోయిన్గా నటించగా.. థమన్ సంగీతాన్ని అందించాడు.

Updated : 31 July 2023 11:36 AM IST
Tags:    
Next Story
Share it
Top