Home > సినిమా > ‘బ్రో ’ వ్యాపారం...పవన్ పేరు చెప్పి సొమ్ముచేసుకుంటున్నారు...

‘బ్రో ’ వ్యాపారం...పవన్ పేరు చెప్పి సొమ్ముచేసుకుంటున్నారు...

‘బ్రో ’ వ్యాపారం...పవన్ పేరు చెప్పి సొమ్ముచేసుకుంటున్నారు...
X

మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. తమిళ సినిమా వినోదయ సీతంకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా...పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. తమిళ్‌లో సముద్రఖని చేసిన పాత్రలో పవన్ కనిపిస్తున్నారు. తంబి రామయ్య అనే మరో కీలక పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు.



బ్రో చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన పవన్, సాయిధరమ్ తేజ్ లుక్స్ ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. దాంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో మొదలైంది. అయితే ఈ సినిమాకు రేట్లు ఓ రేంజిలో చెప్తున్నట్లు సమాచారం. చిత్రంలో కేవలం పవన్ కల్యాణ్ 40-45 నిమిషాలు నిడివికి...పవన్ సోలో సినిమాకి చెప్పే రేట్లను నిర్మాతలు చెప్తున్నట్లు తెలుస్తోంది.




పవన్‎కు ఉన్న క్రేజ్, మార్కెట్ దృష్ట్యా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ట్రేడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత పెట్టి సినిమా తీసుకుంటే రికవరీ ఏ మాత్రం ఉంటుందనే లెక్కలు వేస్తున్నారు బయ్యర్లు. ప్రమోషన్స్ పూర్తి కాకముందే ఎలాంటి అంచనాకు రాలేమని వేచి చూస్తున్నారు. ఇప్పటికే బ్రో సినిమాకు చెందిన శాటిలైట్ రైట్స్ జీ తెలుగు కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రోజుకు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మొత్తం పవన్ 20 నుంచి 25 రోజులకు 50 కోట్లు అందుకున్నారట. ఈ మూవీకి అందరి రెమ్యునరేషన్ లతో కలుపుకొని రూ. 120 కోట్ల వరకు బ‌డ్జెట్ పెట్టార‌ని తెలుస్తోంది. అదే స్థాయిలో బిజినెస్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Updated : 24 Jun 2023 6:41 PM IST
Tags:    
Next Story
Share it
Top