Home > సినిమా > ఇన్‌స్టా లో పవన్ కల్యాణ్‌ తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా?

ఇన్‌స్టా లో పవన్ కల్యాణ్‌ తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా?

ఇన్‌స్టా లో పవన్ కల్యాణ్‌ తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా?
X

స్టార్ హీరో, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఇటీవలె ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లోకి అలా అడుగుపెట్టాడో లేదో లక్షలాది మంది ఫాలోవర్స్‌ వచ్చి చేరారు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌కు ఇన్‌స్టాలో 2.4 మిలియన్‌ల ఫాలోవర్స్‌ ఉన్నారు. కాగా తాజాగా పవన్‌ ఇన్‌స్టాలో తొలిపోస్ట్‌ వేశాడు. సినీ ఇండస్ట్రీలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తలతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి అంటూ పలు సినిమా ఇండస్ట్రీలలోని సెలబ్రెటీలతో కలిసి దిగిన ఫోటోలను ఓ వీడియో రూపంలో పంచుకున్నాడు. ఈ వీడియోలో టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల ప్రముఖులు ఉన్నారు. మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ.. అంటూ పవన్‌ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

తన సినిమాల అప్‌డేట్స్‌ కంటే కూడా రాజకీయంగానే పవన్‌ కళ్యాణ్ సోషల్‌మీడియా అకౌంట్లను వాడుతుంటాడు. జూన్‌ 4న పవన్‌ కళ్యాణ్‌ ఇన్‌స్టా ఖాతాను తెరవగా.. కొద్దిసేపటికే వెరిఫైడ్‌ టిక్‌ కూడా లభించింది. ట్విట్టర్‌ అకౌంట్‌కు పెట్టిన ప్రొఫైల్‌ ఫొటోనే తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ పిక్‌గా పెట్టుకున్నారు పవన్‌ కళ్యాణ్‌. ట్విట్టర్‌లో ఉన్న ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో.. జైహింద్‌ అనే స్లోగన్‌నే ఇన్‌స్టాలోనూ యాడ్‌ చేశారు. ఇక పవన్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో బ్రో మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే రిలీజైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. దీనితో పాటుగా సుజీత్‌తో ఓజీ, హరీష్‌ శంకర్‌తో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చేస్తున్నాడు. ఇక క్రిష్‌ జాగర్లమూడితో పాన్‌ ఇండియా సినిమా హరిహర వీరమల్లు చేస్తున్నాడు.


Updated : 16 July 2023 2:01 PM IST
Tags:    
Next Story
Share it
Top