Home > సినిమా > పవన్తో మూవీ అంటే.. ఓపికుండాలి. లేదంటే వదిలేసి వేరేది చూసుకోవాలి

పవన్తో మూవీ అంటే.. ఓపికుండాలి. లేదంటే వదిలేసి వేరేది చూసుకోవాలి

పవన్తో మూవీ అంటే.. ఓపికుండాలి. లేదంటే వదిలేసి వేరేది చూసుకోవాలి
X

పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే అంత ఈజీ కాదని డైరెక్టర్లకు, నిర్మాతలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఎంత బీజీగా ఉన్నాడో చెప్పనక్కర్లేదు. ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సినిమాలకు దూరం అవుతున్నాడు పవన్. ప్రస్తుతం ఆయన సినిమాలు వరుసగా ఉన్నా.. మరో రెండు సినిమాలో మాత్రం ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ప్రస్తుతం పవన్ తో సినిమాలు చేయాలంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కు ఓపికైనా ఉండాలి, లేదంటే ఆయనను వదిలి వేరే సినిమాలు చేసే ధైర్యం అయినా చేయాలి. ఈ లిస్ట్ లో ప్రస్తుతం క్రిష్, హరీశ్ శంకర్ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు.

ఇప్పుడు పవన్ చేతిలో బ్రో, హరిహర వీరమల్లు, ఉత్సాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఓజీ, బ్రో సినిమాలో షూటింగ్స్ పూర్తవగా.. హరిహర వీరమల్లు షూటింగ్ 50శాతం పూర్తయింది. ఈ రెండు ప్రాజెక్ట్ లు ఓజీ, బ్రో సినిమాలకంటే ముందు అనౌన్స్ చేసినా.. మేకింగ్ లో పవన్ బిజీ కారణంగా లేట్ అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ దయ తల్చితేనే ఈ సినిమాలు పూర్తై థియేటర్స్ లోకి వస్తాయి. లేదంటే మరో ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఈ కారణంతోనే క్రిష్, హరీశ్ శంకర్ లాంటి డైరెక్టర్స్ పవన్ ను కదిలించకుండా.. వేరే హీరోలతో సినిమాలు చేస్తున్నారు.


Updated : 18 July 2023 10:28 PM IST
Tags:    
Next Story
Share it
Top