Home > సినిమా > బ్రో థియేటర్లలో సందడి చేసిన జూనియర్ పవన్

బ్రో థియేటర్లలో సందడి చేసిన జూనియర్ పవన్

బ్రో థియేటర్లలో సందడి చేసిన జూనియర్ పవన్
X

ఈరోజంతా బ్రో వాతావరణమే. పవన్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర క్యూ కట్టారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో గోలగోల చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే రచ్చ జరుగుతోంది. ఎక్కడ చూసిన సినిమాకు సంబంధించిన వీడియోలు, థియేటర్ల దగ్గర అభిమానులు చేస్తున్న సందడే కనిపిస్తోంది. అయితే వీటన్నింటితో పాటు మరొకటి కూడా తెగ ట్రెండ్ అవుతోంది. అదే పవన్ కల్యాణ్ కొడుకు అకీరా ఫోటో.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ థియేటర్ దగ్గర అకీరా నందన్ సందడి చేశాడు. తన తండ్రి సినిమా చూడ్డానికి వచ్చాడు. దీంతో పవన్ అభిమానులు పండగ చేసుకున్నారు. అకీరా అంటూ అరుపులూ, కేకలతో హాల్ దద్దరిల్లిపోయింది. సెల్ ఫోన్లతో అతడిని చిత్రీకరిస్తూ.. వీడియోను నెట్టింట్లో తెగ షేర్ చేశారు.వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు జూనియర్ పవర్ స్టార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కుర్రాడు బావుననాడని మాట్లాడేసుకుంటున్నారు. త్వరగా సినిమాల్లోకి రావాలి అంటూ కామెంట్లతో హోరెత్తించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఆయన కొడుకు అకిరా నందన్ సినీ ఎంట్రీ కోసం ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సిక్స్ ఫీట్ హైట్ తో మంచి బాడీతో ఉన్న అతడు.. తండ్రికి మించిన పెద్ద సూపర్ స్టార్ అవ్వడానికి అన్నీ విధాలుగా అర్హత ఉన్నవాడని అంటున్నారు. అతడు ఏదో ఒకరోజు గ్రాండ్ గా డెబ్యూ ఇస్తాడని ఆశిస్తున్నారు.


Updated : 28 July 2023 3:44 PM IST
Tags:    
Next Story
Share it
Top