దర్శకేంద్రుడితో పవన్ కళ్యాణ్ వారసుడు.. ప్లాన్ ఏంటంటే..?
Mic Tv Desk | 21 Aug 2023 10:56 PM IST
X
X
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ అమెరికా పయనమయ్యాడు. యూఎస్ లోని ఓ ఫిల్మ్ స్కూల్లో చేరాడు. ఈ విషయాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలిపారు. ఇటీవల నార్వేలోని స్టావెంజర్ లో బాహుబలి సినిమా మ్యూజిక్ సింఫనీ ప్రదర్శించగా.. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి, రాఘవేంద్రరావు, రేణూ దేశాయ్ హాజరయ్యారు. ఈ క్రమంలో తన మనవడు కార్తికేయ, అకీరా నందన్ తో కలిసి దిగిన ఫొటోను రాఘవేంద్రరావు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ‘నాలుగో తరం వారసులతో కలిసి నార్వేలో ఉన్నా. నా మనవడు కార్తికేయ, అకీరా నందన్ ఫిల్మ్ స్కూల్లో చేరార’ని పోస్ట్ చేశాడు. అకీరా నందన్ ఇప్పటికే పలు రూపాల్లో కనిపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్, సంగీతంలోనూ శిక్షణ తీసుకుంటూ ఇప్పటికే సినిమాల దిశగా అడుగులు వేస్తున్నాడు.
Updated : 21 Aug 2023 10:56 PM IST
Tags: Akira Nandan Pawan Kalyan renudeshai america Film School K.Raghavendrarao Kartikeya USA Tollywood cinema news movie news entertainment
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire