Home > సినిమా > పవన్ ఫ్యాన్స్కు ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ గిఫ్ట్..

పవన్ ఫ్యాన్స్కు ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ గిఫ్ట్..

పవన్ ఫ్యాన్స్కు ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ గిఫ్ట్..
X

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే ట్రీట్లతో ఆయన ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓజీ, హరిహరవీరమల్లు అప్డేట్స్తో ఫ్యాన్స్కు బిగ్ ట్రీట్ ఇచ్చిన పవన్.. ఇప్పుడు మరో మూవీకి సంబంధించిన న్యూ పోస్టర్తో ట్రిపుల్ ధమాకా ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్లో పవన్ లుంగీ కట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్నాడు. పవన్ మాస్ స్వాగ్తో ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు. ఈ పోస్టర్తో పాటు ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.





గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ - పవన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. అప్పట్లో వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కు గబ్బర్ సింగ్ ఒక బూస్టర్ లా నిలిచింది. 11ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద సంగీతం అందిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో పంకజ్ త్రిపాఠి, గౌతమి, అశుతోష్ రాణా వంటి పలువురు ప్రముఖులు నటిస్తున్నారు.

ఇవాళ ఉదయం పవన్ నటిస్తున్న ఓజీ ఈ గ్లింప్స్ వీడియో రిలీజ్ అయ్యింది. ఇక ఈ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా స్ట‌యిలిష్ లుక్‌లో కొత్త‌గా కనిపిస్తున్నాడు. ఇందులో ‘‘పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా. అది మ‌ట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు న‌రికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాన్ కడగకలేకపోయింది. ఇట్ వాస్ ఏ ఫ్రీకింగ్ బ్ల‌డ్ బాత్. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే.. సాలా షైతాన్ అజాయేగా అంటూ” బ్యాక్ గ్రౌండ్‌లో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్‌ అదిరిపోయింది.




Updated : 2 Sept 2023 9:06 PM IST
Tags:    
Next Story
Share it
Top