చిరంజీవికి ప్రేమతో పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
X
ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. మంగళవారం చిరంజీవి 68 పడిలో అడుగుపెడుతున్నారు. అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్ట్‌ను విడుదల చేశారు.
"అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్టు మీ పయనం నాకు గోచరిస్తూంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతీనిజాయితీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya’ అని పవన్ తన విషెస్‌ను తెలిపారు.
అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan@KChiruTweets#HBDMegastarChiranjeevi pic.twitter.com/ERu1BHiifr
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2023