బ్రో ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే...
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా థియేటర్లలో ఆకట్టుకుంది. గత నెలలో థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. మామ అల్లుడు కలిసి నటించిన చిత్రంతో మెగా అభిమానులు పండగ చేసుకున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతమ్ సినిమాను తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. తమిళంలోని మూల కథను తీసుకుని పవన్ స్టార్ డమ్ కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. అయినా కూడా కథ ఆకట్టుకుంది.
ఇందులో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. సముద్రఖని(Samudrakhani) దర్శకత్వంలో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా వచ్చే శుక్రవారం (ఆగస్టు 25) నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. దీనిపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ బర్త్ డే(Pawan Kalyan Birthday) సందర్భంగా.. సెప్టెంబర్ 2న విడుదల చేయాలని చూశారు. కానీ అంతకు కొన్ని రోజుల ముందే.. ఓటీటీలోకి రానుందీ సినిమా. అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ముందే ట్రీట్ వచ్చేస్తుంది. జీ తెలుగు శాటిలైట్ రైట్స్ తీసుకుంది.