ఆ డైరెక్టర్ అడిగింది కాదనకుంటే.. ఇప్పటికి 30 సినిమాలు పూర్తయ్యేవి : పాయల్ ఘోష్
X
పదిహేనేళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పాయల్ ఘోష్.. 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా పెద్ద అవకాశాలు దక్కించుకోలేకపోయింది. మొదట్లో
ప్రయాణం, ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్ చిత్రాలు తీస్తూ ఊపు మీదున్న ఆమె కెరీర్.. ఒక్కసారిగా కిందికి దిగింది. తాజాగా తన 11వ సినిమాను ప్రకటించింది. ఫైర్ ఆఫ్ లవ్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే, ఇటీవల ఆవిడకు ఇండస్ట్రీలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ ఘటన గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
‘నేను ఆ డైరెక్టర్లు అడిగినట్లు వాళ్లతో బెడ్ షేర్ చేసుకుని ఉంటే.. ఇప్పటికి నా కెరీర్ లో 30 సినిమాలు పూర్తై ఉండేవి. ఇక్కడ పెద్ద సినిమాల్లో ఛాన్స్ రావాలంటే బెడ్ రూంలోకి వెళ్లాల్సిందే. లేదంటే సినిమా కెరీర్ ముగిసినట్లే’ అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై అభిమానులు స్పందిస్తూ పాయల్ కు సపోర్ట్ ఇచ్చారు. ఎంత కష్టమైనా నిజాయితీగానే ఉండాలని.. అడ్డదారులు తొక్కొద్దని కామెంట్లు చేస్తున్నారు.
What??? Go to police station and complain against Kashyap.
— Ravi Tiwari Bihari 🇮🇳 (@iRaviTiwari) March 18, 2023