రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ను జాతికి అంకితం చేసిన మోదీ
X
తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. నిజమాబాద్లో 8వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. రైల్వే, విద్యుత్, ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. మనోహరాబాద్ - సిద్దిపేట రైల్వేలైన్‌ను ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. 2016లో తాను ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. ఇప్పుడు ప్రారంభించకున్నట్లు మోదీ చెప్పారు.
ఎన్టీపీసీలో రామగుండం ప్లాంట్ అత్యాధునికమైందని మోదీ తెలిపారు. త్వరలో TTPP రెండో దశ పనులు ప్రారంభిస్తామని మోదీ చెప్పారు. దేశంలో 100శాతం విద్యుదీకరణ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా పథకం ఆయుష్మాన్ భారత్ అని అన్నారు. ఎయిమ్స్ సంఖ్యను పెంచుతున్నామన్నా ఆయన బీబీనగర్ ఎయిమ్స్ పనులు చకచకా జరుగుతున్నట్లు వివరించారు. సిద్ధిపేట సికింద్రాబాద్ రైలుకు గ్రీన్ సిగ్నల్