బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కారు డ్రైవర్లపై పోలీస్ కేసు
Bharath | 19 Dec 2023 9:08 PM IST
X
X
బిగ్ బాస్ ఫ్యాన్స్ వీరంగం కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విజయోస్తు ర్యాలీ తీసిన ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని సాయికిరణ్, రాజుగా గుర్తించారు. పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. పల్లవి ప్రశాంత్ ను రెండోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ర్యాలీగా తీసుకొచ్చినందుకు పోలీసులు విచారిస్తున్నారు. రెండోసారి ర్యాలీకి రావడంతో.. అభిమానులు రెచ్చిపోయి ప్రవర్థించారు. దీంతో వారిని అదుపు చేయడం పోలీసుల వల్ల కాలేదు. పరిస్థితి చేయి దాటిపోవడంతో.. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కాగా ఈ కేసులో పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నారు. అతనిపై పోలీసులు 6 కేసులు నమోదు చేశారు.
Updated : 19 Dec 2023 9:08 PM IST
Tags: AmarDeep Bigg Boss Bigg Boss 7 Telugu Bigg Boss Fans Ruckus Bigg Boss Telugu 7 pallavi prashanth telangana hyderabad hyderabad police bigg boss final Bigg Boss case
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire