కేపీ చౌదరి విచారణ.. డ్రగ్స్ కేసులో బిగ్బాస్ బ్యూటీ, టాలీవుడ్ నటుల పేర్లు
X
హైదరాబాద్ లో తాజాగా డ్రగ్స్ ముఠా కలకలం రేపింది. సైబరాబాద్ పరిధిలో మరోసారి డ్రగ్స్ మాఫియాను అరెస్ట్ చేశారు పోలీసులు. రెండు రోజుల క్రితం కబాలి సినిమా నిర్మాత కేపీ చౌదరిని కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇవాళ వెలువడిన కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఆ రిపోర్ట్ తో టాలీవుడ్ ప్రముఖులు షేక్ అవుతున్నట్లు సమాచారం. విచారణలో కేపీ చౌదరి ఫోన్ లో ఉన్న 9000 ఫొటోలు, కాంటాక్స్ ను డీ కోడ్ చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి.
ఇవాళ జరిగిన కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్ లో ముఖ్యంలో 12 మంది కీలక వ్యక్తుల పేర్లు బయటికి వచ్చాయి. అందులో ముఖ్యంగా బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి, టాలీవుడ్ నటులు సురేఖా వాణి, జ్యోతిల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రిమాండ్ రిపోర్ట్ లో పాత నేరస్తుల పేర్లతో పాటు కొత్తగా మరి కొన్నిపేర్లు కూడా బయటికి వచ్చాయి. అందులో ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారుల పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. వాళ్లకు చాలాకాలంగా కేపీ చౌదరి డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే, పోలీస్ విచారణ అనంతరం కస్టడీలో ఉన్న కేపీ చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్నవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని, తను ఎలాంటి తప్పు చేయలేదని అన్నాడు. తన ఫోన్ లో ఉన్న కాంటాక్స్, ఫొటోలకు డ్రగ్స్ కేసుకు సంబంధం లేదని, వాళ్లంతా తన ఫ్యామిలీ వాళ్లని కేపీ చౌదరి వివరించాడు. అయితే, పోలీస్ విచారణలో కేపీ చౌదరికి.. లీక్ అయిన పేర్లకు లక్షల్లో ట్రాన్ సాక్షన్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు మరో రెండు రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు.