Home > సినిమా > పాటల చిత్రీకరణలో ‘పోలీస్ వారి హెచ్చరిక’

పాటల చిత్రీకరణలో ‘పోలీస్ వారి హెచ్చరిక’

పాటల  చిత్రీకరణలో ‘పోలీస్ వారి హెచ్చరిక’
X

నల్లపూసలు ఫేం " బాబ్జీ" దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న

ఈ చిత్రం శరవేగంగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా దర్శకుడు బాబ్జీ చిత్రం మాట్లాడుతూ.. ‘ అరకులోయ , కాఫీ వనం , ఆపిల్ రిసార్ట్స్ ,వైజాగ్ యారాడా బీచ్ , నకిరేకల్ లాండ్స్ , యస్ స్టూడియో మొదలైన లొకేషన్ లలో యీ చిత్రం లోని పాటలను చిత్రీకరించామన్నారు. గత రెండు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని గాయనీ గాయకులతో ఐదు లక్షల ప్రైవేట్ సాంగ్స్ ను స్వరపరచి సంచలనం సృష్టించి , రెండు రాష్ట్రాలలోని ప్రైవేటు పాటల గాయనీ గాయకులకు , పాటల రచయితలకు అభిమాన పాత్రుడైన సంగీత దర్శకుడు

‘గజ్వేల్ వేణు’ ను ఈ సినిమా ద్వారా వెండితెరకు సంగీత దర్శకుడుగా పరిచయం చేస్తున్నామని.. ’ తెలిపారు.

చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ ‘రెండు రోజులలో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుందని, ఆ వెంటనే నల్గొండ లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించడం తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని " తెలిపారు.

Updated : 17 April 2024 7:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top