Home > సినిమా > Chiranjeevi : రాజకీయాలు దిగజారిపోతున్నాయి.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్

Chiranjeevi : రాజకీయాలు దిగజారిపోతున్నాయి.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్

Chiranjeevi : రాజకీయాలు దిగజారిపోతున్నాయి.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
X

(Chiranjeevi) వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు దిగజారిపోతున్నాయన్నారు ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి. నంది అవార్డుల స్థానంలో కొత్త అవార్డులు తీసుకురావడం శుభపరిణామమని అన్నారు. గద్దర్ పేరుతో నంది అవార్డులను ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. పురస్కారాలు ప్రకటించిన వెంటనే సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదన్నారు. మనవాళ్లను మనం గౌరవించుకోకపోతే ఇంకెవ్వరూ గుర్తించరని తెలిపారు. కళాకారులను గుర్తించి అవార్డులు ఇవ్వడం ద్వారా వారిలో ఉత్సాహం నిండుతుందని అన్నారు. కాలేజీ రోజుల్లో నుంచి వెంకయ్యనాయుడికి పెద్ద అభిమానిని అని గుర్తు చేసుకున్నారు. వెంకయ్యనాయుడు స్పీచ్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండేవాడినని చెప్పుకొచ్చారు. ఆయనను ఆదర్శంగా తీసుకొనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని తెలిపారు. రాజకీయాల్లో హుందాతనం లేదని..మాటలు పడలేక వాటిని తట్టుకోలేక రాజకీయాల్లో ఉండలేకపోయానని చెప్పారు. విమర్శలు చేసే వారిని ప్రజలే తిప్పి కొట్టాలని చిరంజీవి సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ శిల్పకళావేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క పలువురు మంత్రులు పాల్గొన్నారు.




Updated : 4 Feb 2024 9:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top