Home > సినిమా > పాపం బుట్టబొమ్మకు సినిమాల్లేవ్

పాపం బుట్టబొమ్మకు సినిమాల్లేవ్

పాపం బుట్టబొమ్మకు సినిమాల్లేవ్
X

తెలుగులో 'ఒక లైలా కోసం' మూవీతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ తర్వాత బిజీ స్టార్‌గా మారింది. వరుస సినిమా అవకాశాలతో స్టార్ హీరోల సరసన నటించింది. బన్నీతో కలిసి అలవైకుంఠపురం సినిమాతో నేషనల్ వైడ్ మంచి ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగాక బుట్టబొమ్మకు చేతినిండా సినిమాలున్నాయి. అయితే ఈ బ్యూటీ టాలీవుడ్‌కు టాటా చెప్పేసి బాలీవుడ్‌కు చెక్కేసింది. బాలీవుడ్‌కు వెళ్లాక తెగ అవకాశాలు వచ్చేస్తాయని సంబర పడింది.

డేట్స్ అడ్జస్ట్ కాలేదని మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్‌ను కూడా వదిలేసుకుంది. దీంతో బాలీవుడ్ కోసం సౌత్ సినిమాలని వదిలేసుకుందని పూజా హెగ్డేపై నోరుపారేసుకున్నారు. అయితే బాలీవుడ్‌కి వెళ్లిన పూజా పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. సల్మాన్ ఖాన్‌తో సినిమా చేశాక బుట్టబొమ్మ మరో సినిమా చేయలేదు. చేతినిండా సినిమాలు లేకుండా ఒక సంవత్సరం గడిపేసింది. ప్రస్తుతం పూజా హెగ్డేకి బాలీవుడ్‌లో ఒకేసారి మూడు ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది. కానీ వాటిపై క్లారిటీ లేదు. పాపం సినిమా అవకాశాల్లేక బాధపడుతున్న బుట్టుబొమ్మను ఇకనైనా టాలీవుడ్‌ లోకి వచ్చేయాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.



Updated : 20 March 2024 5:21 PM IST
Tags:    
Next Story
Share it
Top