గుంటూరు కారంలోకి రీ ఎంట్రీ ఇస్తున్ పూజా హెగ్డే?
X
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్ ఉంది. ఇందులో శ్రీలీల, మీనాక్ష చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు ఇందులో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
గుంటూరు కారం సినిమాలో అసలు ముందు పూజా హెగ్డేనే మీరోయిన్ గా అనుకున్నారు. కానీ కథలో మార్పులు చేయడం వలన ఆమె స్థానంలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే అంతకు ముందే పూజా హెగ్డేకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇప్పడు ఆ అడ్వాన్స్ ను సిరిపెట్టడానికి ఆమెతో స్పెషల్ సాంగ్ చేయించనున్నారని టాక్ వినిపిస్తోంది. దాదాపు ఖరారైందని చెబుతున్నారు.
రంగస్థలంలో పూజా పాప చేసిన ఐటెం సాంగ్ సూపర్ హిట్ అయింది. అందుకే ఇప్పుడు గుంటూరు కారంలో కూడా సాంగ్ చేయడానికి ఒప్పుకుందని వినికిడి. సినిమా సూపర్ హిట్ అవడానికి ఈ స్పెషల్ సాంగ్ కూడా హెల్స్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. పాటను కూడా అందుకు తగ్గట్టే తయారు చేస్తున్నారని తెలుస్తోంది. పూజా కెరియర్ లో ఈ సాంగ్ స్పెసల్ గా నిలుస్తుందని అంటున్నారు. అయితే మూవీ టీమ్ నుంచి ఇప్పటి వరకు దీని గురించి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకోవడం అంత చిన్న విషయం కాదు కాబట్టి... స్పెసల్ సాంగ్ కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు.