తాను బ్రతికే ఉన్నానని బాంబు పేల్చిన పూనమ్ పాండే
X
‘నేను చనిపోలేదు. బతికే ఉన్నా. క్షేమంగా ఉన్నా’ అంటూ స్వయంగా పూనమ్ పాండే వీడియో రిలీజ్ చేసింది. పూనమ్ చనిపోయిందని నిన్న ఏ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ వచ్చిందో.. అదే ఇన్ స్టాగ్రామ్ నుంచి తాను బతికే ఉన్నానని తెలుపుతూ ఓ వీడియో విడుదల అయింది. దీంతో నెటిజన్స్ అయోమయంలో పడిపోయారు. తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఓ బాంబు పేల్చుతూ.. పబ్లిసిటీ స్టంట్ కోసం పూనం ఈ విధంగా నాటకం ఆడుతుందని చెప్పాడు. ‘పూనం బతికే ఉంది. నేను ఆమె కజిన్ తో మాట్లాడా. పబ్లిసిటీ స్టంట్ కోసం నాటకం ఆడుతుంది. మరణ వార్త వింటూ ఎంజాయ్ చేస్తుంద’ని ఉమర్ ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి.. స్వయంగా పూనమ్ పాండే వీడియో రిలీజ్ చేసింది.
నిన్న ఆమె అకౌంట్ నుంచి ‘‘ఇవాళ (ఫిబ్రవరి 2) ఉదయం పూనమ్ పాండే మరణించింది. గర్భాశయ క్యాన్సర్తో ఆమె చనిపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాము.’’ అని పూనమ్ టీం పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఈ క్రమంలో పూనమ్ స్వయంగా వీడియో రిలీజ్ చేసి.. తాను బతికే ఉన్నానని చెప్పేసరికి అంతా షాకయ్యారు. సర్వైకల్ క్యాన్సర్ పై చాలామంది మహిళలకు అవగాహన లేదని.. దీనిపై అవగాహన కల్పించేందుకే తాను చనిపోయినట్లు ప్రచారం చేపించుకున్నట్లు పూనమ్ చెప్పుకొచ్చింది. ‘నేను బతికే ఉన్నా. సర్వైకల్ క్యాన్సర్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది మిగతా క్యాన్సర్ల మాదిరికాదు. ఈ వ్యాధిని నివారించడం సాధ్యమే. హెచ్‌పీవీ వ్యాక్సిన్ లేదా ముందస్తుగా గుర్తించడం అవసరం. ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. దీనిపై అందరికీ అవగాహన కల్పిద్దాం’అని వీడియోలో పూనమ్ చెప్పుకొచ్చింది. ఎప్పుడు సోషల్ మీడియాలో, బయట వివాదాల్లో ఇరుక్కునే పూనమ్ ఇలా ప్రాంక్ చేయడంపై.. అంతా మండిపడుతున్నారు.
Just called #PoonamPandey Cousin now, And she is Alive & enjoying her death news. She did Publicity Stunt !!!
— Umair Sandhu (@UmairSandu) February 2, 2024