పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌కి షాక్..పోలీసులు ఇంటికి వచ్చి..
X
సెలబ్రిటీలు చేసే కొన్ని వీడియోలు కొన్నిసార్లు వారిని చిక్కుల్లో పడేస్తుంటుంది. తాజాగా అలాంటి చిక్కుల్లోనే పాడిపోయింది పాపం పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ .ఆమె రీసెంట్గా సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఏకంగా ఆమె ఇంటికి పోలీసులు వచ్చేలా చేసింది. ఆ తర్వాత పోలీసులకు క్లారిటీ ఇవ్వడంతో వివాదం ముగిసినట్లైంది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. కొన్ని రోజుల క్రితం బ్రిట్నీ స్పియర్స్ తన కిచెన్‌లో కత్తులతో డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలతో పాటు ఓ మేసేజ్ పెట్టింది " నేను కిచెన్‌లో కత్తులతో ఆడుకుంటున్నాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు..ఇవి నిజమైన కత్తులు కాదు" అంటూ కామెంట్ చేసింది. అయితే ఒక వీడియోలో ఆమె డ్యాన్స్ చేసిన అనంతరం ఆమె థైస్, హ్యాండ్స్పై కట్ చేసుకున్నట్లు చూపించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ బ్రిట్నీ డేంజర్లో ఉందని భావించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన వెంచురా కౌంటీ పోలీసులు బ్రిట్నీ ఇంటికి వెళ్లారు. ఆమె మెంటల్లీ బాగానే ఉందని ఉందని తెలుసుకున్న పోలీసులకు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానిక న్యూస్ ఛానెల్స్ తెలిపాయి. ఈ విషయాన్ని వివరిస్తూ బ్రిట్నీ మరో వీడియో షేర్ చేసింది. " నేను నా ఫేవరేట్ సింగర్ షకీరాను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాను. మీరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. దయచేసి మీరు పోలీసులకు ఫోన్ చేయొద్దు" అని తన ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసింది. ఈ పోస్ట్‌తో బ్రిట్నీ సేఫ్‌గానే ఉందని ఊపిరి పీల్చుకున్నారు.