Home > సినిమా > ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
X

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ (53) మృతి చెందారు. ఆదివారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వారం రోజుల క్రితం వైజాగ్ ఔట్ షూటింగ్ వెళ్లిన రాకేష్ మాస్టర్..హైదరాబాద్ తిరిగి వచ్చాక అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం ఉదయం నుంచి ఇంట్లో రక్త విరోచనాలు చేసుకున్నారు. ఈక్రమంలో ఆయన్ను గాంధీ హాస్పిటల్‌కు తరలించగా.. పరిస్థితి విషమించడంతో సాయంత్రం 5 గంటలకు ప్రాణాలు వదిలారు. రాకేష్ మాస్టర్ మృతిపట్ల పలువురి సినీ ఇండస్ట్రీ పెద్దలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ లో ప్రముఖ కొరియా గ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లకు రాకేష్ మాస్టర్ గురువు. ఆయన ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. రాకేష్ మాస్టర్ దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.

Updated : 18 Jun 2023 6:33 PM IST
Tags:    
Next Story
Share it
Top