Home > సినిమా > Pakkinti Kurradu:యూట్యూబర్ చందుసాయి అరెస్ట్.. కారణమిదే

Pakkinti Kurradu:యూట్యూబర్ చందుసాయి అరెస్ట్.. కారణమిదే

Pakkinti Kurradu:యూట్యూబర్ చందుసాయి అరెస్ట్.. కారణమిదే
X

ప్రముఖ యూట్యూబర్ చంద్ర శేఖర్ సాయి(పక్కింటి కుర్రాడు)ని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారం చేసి, మోసం చేశాడని అతనిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చందూ గాడు , పక్కింటి కుర్రాడు యూట్యూబ్ ఛానల్స్‌లో వీడియోలు చేశాడు చంద్ర శేఖర్ సాయి అలియాస్ చందూ సాయి. కొన్ని సినిమాల్లోనూ నటించాడు.

పక్కింటి కుర్రాడు (పీకే)గా చందు సాయి చేసే వీడియోలు యూట్యూబ్ లో చాలా పాపులర్ . ఈ వీడియోలకి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. పక్కింటి కుర్రాడు పేరుతో అతి తక్కువకాలంలో సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన చందుసాయి.. గత కొన్నాళ్లుగా యూట్యూబ్‌లో కనిపించడం మానేశాడు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. . తనను ఎవరైతే పాపులర్ చేశారో.. వాళ్లతో వచ్చిన చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అక్కడ నుంచి బయటకు వచ్చేసినట్టు చెప్పారు.

Updated : 15 Dec 2023 7:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top