ఆ సినిమా కోసం రూ.100 కోట్లు తీసుకుంటున్న పవన్ కల్యాణ్?
X
టాలీవుడ్లో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లెక్కే వేరు. యూత్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ మరే నటుడికి ఉండదు. పవన్ సినిమా అంటే ప్రొడ్యూజర్లు ఎంతైనా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు. ఆయన ఎంత రెమ్యునరేషన్ అడిగితే అంతా ఇచ్చేందుకు సై అంటారు. తాజాగా పవన్ చేస్తున్న ఓజీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దెబ్బతో పవర్ స్టార్ కూడా ఈ లిస్టులో చేరిపోయాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
సాహో సినిమా ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో వస్తున్న సినిమా ఓజీ. ఇదొక గ్యంగ్స్టర్ డ్రామా . ఈ సినిమాలో పవన్ ఓ గ్యాంగ్‌స్టర్. ఓజీలో పవన్ ఎంతో స్టైలిష్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పిక్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో పవన్ సరసన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించిన నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూజ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించడంతో పాటు పవన్ కల్యాణ్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌ను అందిస్తున్నట్లు సమాచారం. పవన్ మొదటిసారిగా ఓజీ కోసం రూ.100 కోట్లు వసూలు చేస్తున్నారట. దీంతో పవన్ కూడా వంద కోట్ల హీరోల క్లబ్లో చేరిపోయారు.
పవన్ కల్యాణ్ నాన్ స్టాప్ షూటింగ్‌తో ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారు. షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల షూటింగ్లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు పవన్. జులై 28న బ్రో సినిమా విడుదల కాబోతుండగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఎలక్షన్స్ వచ్చేలోపు చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు.