Home > సినిమా > ఆదిపురుష్‌` యాక్షన్ ట్రైలర్ విడుదల... అభిమానులకు పండగే..

ఆదిపురుష్‌` యాక్షన్ ట్రైలర్ విడుదల... అభిమానులకు పండగే..

ఆదిపురుష్‌` యాక్షన్ ట్రైలర్ విడుదల... అభిమానులకు పండగే..
X

ప్రభాస్‌ హీరోగా వస్తున్న `ఆదిపురుష్‌` సినిమా నుంచి మరో కొత్త ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ ట్రైలర్ పేరుతో 2:24 నిడివి ఉన్న వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. తిరుపతిలో జరుగుతున్న `ఆదిపురుష్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదికగా ఈ ట్రైలర్‎ను వదిలారు.

భిక్షాందేహి అంటూ రావణాసురుడు మాటలతో ప్రారంభమైన ఈ ట్రైలర్ "పాపం ఎంత బలవంతమైనదైనా అంతిమ విజయం సత్యానిదే " అంటూ ప్రభాష్ చెప్పిన డైలాగ్‌తో​ ముగిసింది. ఈ యాక్షన్ ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సీతను రావణాసురుడు తీసుకెళ్లాక జరిగిన యుద్ధ సన్నివేశాలు అబ్బురపరుస్తున్నాయి. ప్రభాష్ డైలాగ్స్‌తో సినిమా అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. మరెందుకు ఆలస్యం మీరు ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.



Updated : 6 Jun 2023 9:47 PM IST
Tags:    
Next Story
Share it
Top