Home > సినిమా > Adipurush : తొలి రోజే రూ.100 కోట్లు.. ట్రేడ్ వర్గాల లెక్క మమాలుగా లేదుగా..!

Adipurush : తొలి రోజే రూ.100 కోట్లు.. ట్రేడ్ వర్గాల లెక్క మమాలుగా లేదుగా..!

Adipurush : తొలి రోజే రూ.100 కోట్లు.. ట్రేడ్ వర్గాల లెక్క మమాలుగా లేదుగా..!
X

ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా 7 వేల స్క్రీన్లతో మెగా రిలీజ్‌ జరగనుంది. అడ్వాన్స్ బుకింగ్కు జనం ఎగబడటంతో సర్వర్లు క్రాష్ అయ్యాయంటే టికెట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన చూస్తే విడుదలైన తొలిరోజే ఆదిపురుష్ రూ.100కోట్లు కొల్లగొట్టడం పక్కా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సోల్డ్ ఔట్ మెసేజ్లు

ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఆదిపురుష్ సినిమా మొదటి మూడ్రోజులు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. తాజా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 4.7లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇప్పటికే ట్వీట్ చేశారు. అందుకు తగ్గట్లుగానే టికెట్ బుకింగ్ ఆన్‌లైన్ సైట్స్ క్రాష్ అవుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే తొలి రోజు వేయి షోలు ప్రదర్శించనుండగా.. హిందీ, తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ ఔట్ మెసేజ్‌లే కనిపిస్తున్నాయి.

రూ.100కోట్లు పక్కా

ఆన్లైన్ లెక్కల ప్రకారం చూస్తే ఆదిపురుష్ సినిమా తొలి రోజు కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక బి, సి సెంటర్లు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో డైరెక్ట్ కౌంటర్ సేల్స్ కలుపుకుంటే అది రూ.125కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఆదిపురుష్ కోసం కేవలం తెలుగు రాష్ట్ర ప్రేక్షకులే కాదు.. హిందీ, కన్నడ ఆడియెన్స్ కూడా కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. ఒక్క హిందీ మార్కెట్ నుంచే దాదాపు రూ.40 కోట్లు కలెక్షన్లు రావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలుగు ఇతర భాషల్లో రూ.60 నుంచి రూ. 70కోట్లు రాబడుతుందని, వరల్డ్ వైడ్ గా చూసుకుంటే తొలిరోజు వసూళ్లు రూ.120 కోట్ల దాటొచ్చని ట్రేడ్ అనలిస్టుులు అంచనా వేస్తున్నారు.

తమిళ్లో నో రెస్పాన్స్

నార్త్ ఇండియాలో ఆదిపురుష్ హిందీ వెర్షన్‌కు సంబంధించి వారం ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రెస్పాన్స్ అదిరిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కొంచెం ఆలస్యమైనా అమ్మకాలు మామూలుగా లేవు. కానీ తమిళనాడులో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తమిళ ప్రేక్షకులు కానీ, ట్రేడ్ వర్గాలు కానీ ఈ సినిమాను పట్టించుకోవడం లేదు.

తమిళంలో ఈ వారం సరైన సినిమాలు లేకున్నా ఆదిపురుష్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు కేటాయించలేదు. అక్కడ కనీసం 20 శాతం టికెట్లు కూడా అమ్ముడుకాలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. నిజానికి తమిళనాడులో చాలామంది రామాయణంను వ్యతిరేకిస్తుంటారు. అదీ సినిమాకు హైప్ క్రియేట్ కాకపోవడానికి ఓ కారణమై ఉంటుందని చెబుతున్నారు.


Updated : 15 Jun 2023 3:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top