Home > సినిమా > Prabhas Birthday Special: ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

Prabhas Birthday Special: ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

Prabhas Birthday Special: ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్
X

కొంతమందికి క్యాలెండర్స్ లోని పండగలుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానులకు. అంటే ఏంటో అర్థమైంది కదా.. యస్.. ఆ హీరోల బర్త్ డేస్ నే ఈ అభిమాన గణం పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు.. చేస్తారు కూడా. అదే టైమ్ లో ఆ హీరోల కొత్త సినిమాల అప్డేట్స్ ను కూడా ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. వారి అంచనాలకు తగ్గట్టుగా ఆయా హీరోలు కూడా ఏదో ఒక పోస్టర్ లేదా గ్లింప్స్, కుదిరితే టీజర్స్ కూడా విడుదల చేస్తుంటారు. అలా ఈ సారి ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ కోసం రెండు అప్డేట్స్ ఇవ్వబోతున్నాడు.

ప్రభాస్ సినిమాఅంటే ఫ్యాన్స్ కు ఎంత పెద్ద సంబరమో అందరికీ తెలుసు. ఇక బర్త్ డే అంటే ఆ సంబరం పండగలా మారుతుంది. ఆ పండగ ఈ నెల 23న రాబోతోంది. అంటే డార్లింగ్ స్టార్ బర్త్ డే. మరి ప్రభాస్ బర్త్ డే అంటే ఫ్యాన్ తో పాటు ఇండస్ట్రీ కూడా ఏ అప్డేట్ వస్తుందా అని ఈగర్ గా చూస్తుంది కదా.. అందుకే వాళ్లు కూడా కొత్త కంటెంట్ తో రెడీగా ఉన్నారు. ఈ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ కొత్త సినిమా సలార్ నుంచి సాలిడ్ వీడియో రాబోతోందని టాక్. అంటే ఇంతకు ముందు మొహం అవుట్ ఫోకస్ లో ఉన్న టీజర్ లా కాక.. ఫోకస్ లో ఉండేలానే ఓ వీడియో విడుదల చేస్తారంటున్నారు. అది లేకపోతే ఓ కొత్త పోస్టర్ అయితే గ్యారెంటీ. మరి ఇది కలర్ లో ఉంటుందా అని అడగొద్దు. అది ప్రశాంత్ నీల్ సినిమా కాబట్టి అయితే బ్లాక్ అండ్ వైట్ లేదంటే గ్రే. అంతే.

ఇక రెండో అప్డేట్.. కల్కి2898ఏడి నుంచి వస్తుందట. కల్కి నుంచి గ్లింప్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాలీవుడ్ టాక్. ఆల్రెడీ వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ పూర్తిగా ప్రభాస్ మాత్రమే కనిపించేలా ఉంటుందట. లేదంటే ఒక మంచి స్టిల్ అయినా గ్యారెంటీ అంటున్నారు. సో.. ఖచ్చితంగా వచ్చే అప్డేట్స్ మాత్రం ఈ రెండు. ఇక మారుతి సినిమాకు సంబంధించి కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అంటున్నా.. కష్టమనే చెప్పాలి. అయితే సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడితో సినిమాలు చేస్తున్నాడా లేదా అనేది ఆయా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వచ్చే బర్త్ డే విషెస్ ను బట్టి తేలిపోతుంది.. సో డార్లింగ్ ఫ్యాన్స్.. గెట్ రెడీ.

Updated : 12 Oct 2023 3:57 PM IST
Tags:    
Next Story
Share it
Top