Home > సినిమా > లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..అందుకోసమేనా?

లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..అందుకోసమేనా?

లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..అందుకోసమేనా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ మూవీస్‌కు సైన్ చేసిన ప్రభాస్ ఈ మూవీస్ షూట్‌లో తీరిక లేకుండా గడుపుతున్నాడట. గత ఏడాది ఆదిపురుష్, సలార్ వంటివి థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లను సాధించాయి. సలార్ అయితే బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఇప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కల్కి 2898AD, డైరెక్టర్ మారుతీతో రాజా సాబ్ మూవీస్ చేస్తున్నారు. షూటింగ్స్‌లో గ్యాప్ దొరికితే చాలు ప్రభాస్ విదేశాలకు టూర్స్ వేస్తుంటాడు.

ఈమధ్య వెకేషన్స్‌కు వెళ్లడం ఎక్కువైంది. ఆమధ్య లండన్‌లో ప్రభాస్ ఓ ఇంటిని కొన్నాడనే టాక్ వైరల్ అయ్యింది. దీంతో ప్రభాస్ మకాం మారుస్తున్నాడనే విషయం నెట్టింట బాగా వినిపించింది. లండన్‌లో ఓ విలాసవంతమైన భవనాన్ని ప్రభాస్ కొన్నాడట. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ కాలికి గాయం అయ్యింది. ఆ గాయానికి చికిత్స చేయించుకోవడం కోసం ప్రభాస్ లండన్ వెళ్లి వస్తుంటాడు. ఇప్పటికే పలుమార్లు లండన్‌కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు.

అయితే లండన్‌లోని డాక్టర్లు కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పారట. అందుకోసం ప్రభాస్ అక్కడే ఓ భారీ సౌకర్యాలున్న ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటికి 60 లక్షల రూపాయల అద్దెను కూడా చెల్లిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. కొందరేమో ఆ ఇంటిని ప్రభాస్ పూర్తిగా కొనుగోలు చేశాడని చెబుతున్నారు. మొత్తానికి లండన్‌లో ప్రభాస్ ఓ ఇంటివాడయ్యాడని తెలుస్తోంది.

Updated : 26 March 2024 12:18 PM GMT
Tags:    
Next Story
Share it
Top