Home > సినిమా > Prabhas-Maruthi Movie: ప్రభాస్‌, మారుతి మూవీ నుంచి బిగ్ అప్‌డేట్

Prabhas-Maruthi Movie: ప్రభాస్‌, మారుతి మూవీ నుంచి బిగ్ అప్‌డేట్

Prabhas-Maruthi Movie: ప్రభాస్‌, మారుతి మూవీ నుంచి బిగ్ అప్‌డేట్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 22 విడుదలైన ఈ సినిమా రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైన వారంలోపే సలార్ రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో డార్లింగ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇచ్చేలా.. తాజాగా ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ప్ర‌భాస్‌, మారుతి మూవీపై శుక్ర‌వారం మేక‌ర్స్ బిగ్ అప్ డేట్‌ను రివీల్ చేశారు. సంక్రాంతి పండుగ రోజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్​ను రిలీజ్ చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. 'ఇప్పుడు వరకు డైనోసార్ ప్రభాస్​ను చూశారు, ఇక డార్లింగ్ ప్రభాస్​ను చూసేందుకు సిద్ధం అవ్వండి' అంటూ క్యాప్షన్​ ఇచ్చింది. అంతేకాకుండా ప్రభాస్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ప్ర‌భాస్ లుక్‌ను షాడోలో చూపిస్తూ ఓ మ‌ల్టీ క‌ల‌ర్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సూప‌ర్ నాచుర‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో డైరెక్ట‌ర్ మారుతి ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రిత‌మే ప్రారంభ‌మైంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భాస్‌, మారుతి మూవీకి సంబంధించి ఒక్క అప్‌డేట్ కూడా మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. ప్ర‌భాస్ మిన‌హా ఇందులో న‌టిస్తోన్న హీరోయిన్లు, ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల్ని సైతం వెల్ల‌డించ‌క‌పోవ‌డం అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తోంది. ఒక బంగ్లా నేపథ్యంలోనే ఈ సినిమా కథ మొత్తం నడుస్తుందంట. ఈ మూవీ టైటిల్ రాజా డీలక్స్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండా ఈ మూవీ చేస్తున్నారని టాక్. అందుకే రూ.100 నుంచి రూ.150 కోట్ల మధ్యనే ఈ సినిమాకు బడ్జెట్ అవ్వనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అంటే సినిమా సక్సెస్ తరువాత బిజినెస్​లో వాటా తీసుకునేలా ప్రభాస్​ డీల్ సెట్ చేసుకున్నట్లు టాక్.

Updated : 29 Dec 2023 10:09 AM IST
Tags:    
Next Story
Share it
Top