సాహో, రాధేశ్యామ్.. మళ్లీ ఇప్పుడు ఆదిపురుష్
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల షోలు కంప్లీట్ అవ్వడంతో టాక్ బయటకు వచ్చేస్తోంది. కొన్ని చోట్ల సినిమా బాగుందని, రాముడిగా ప్రభాస్ అద్భుతంగా నటించాడని.. ప్రేక్షకులు చెబుతున్నారు. కానీ వారిలో ఎక్కువ శాతం.. ప్రభాస్ లాంటి హై రేంజ్ ఉన్న యాక్టర్‌ని డైరెక్టర్ సరిగా వాడుకోలేదంటున్నారు. నాసిరకం గ్రాఫిక్స్ తో, కార్టూన్ మూవీగా తీశాడని ఓం రౌత్ పై మండిపడుతున్నారు. రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఇలాంటి డొల్ల సినిమా తీశాడంటూ థియేటర్ల వద్ద ఫ్యాన్సే చెబుతున్నారు. నటీనటుల యాక్షన్ పరంగా ఓకే కానీ.. డైరెక్షన్ మాత్రం.. ఓం రౌత్ తనకు నచ్చినట్లు తీశారంటున్నారు.
మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో రావణుడి పాత్ర చూపించిన తీరు ఎబ్బెట్టుగా అనిపించిందని, రావణుడి సీజీ వర్క్ కూడా బాగోలేదంటున్నారు. సెకండాఫ్‌లో రామాయణంలోని మూలకథ నుంచి ఓం రౌత్ కాస్త సైడ్ ట్రాక్ ఎక్కినట్టే ఉందని కంప్లైంట్ చేస్తున్నారు. సెకండాఫ్‌లో 30 నిమిషాలకు పైగా ల్యాగ్ ఉందని, ప్రభాస్ చేత పవర్ ఫుల్ డైలాగులు చెప్పించలేదంటున్నారు. బీజీఎం అప్పడప్పుడు సినిమాను కొన్ని సీన్లలో లేపినా.. కథ, కథనాల్లో ఎలాంటి భావోద్వేగాలు పండకపోవడంతో చివరకు సినిమా స్లో గా నడిచిందంటున్నారు. క్లైమాక్స్ సీన్స్ లో విజువల్స్ కోసం కోట్లాదిరూపాయలు ఖర్చు చేశారని.. అయితే ఆ విజువల్స్ మాత్రం కార్టూన్లలా ఉన్నాయని ఫైర్ అవుతున్నారు. ఓవరాల్‌గా ఆదిపురుష్ యబో యావరేజ్ అంటున్నారు.
సాహో, రాధేశ్యామ్ తర్వాత బాహుబలి రేంజ్ హిట్‌కోసం అందరూ ఎదురు చూసినా.. ఆ అంచనాలు ఆదిపురుష్ అందుకోలేదంటున్నారు. ఇక రాబోయే ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్ లాంటి సినిమాలలో అయినా డైరెక్టర్లు తమకు నచ్చిన ప్రభాస్ అన్నను చూపించాలంటున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఊహించిన విధంగానే విమర్శలను ఎదుర్కోవడంతో ఇప్పుడు అభిమానులు అందరూ ఆశలు అన్ని సలార్ సినిమాపై పెట్టుకున్నారు. ఈ సినిమాకు కేజిఎఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.