Home > సినిమా > Salaar Trailer : సలార్ .. ఇదైనా నిజమేనా లేక ...?

Salaar Trailer : సలార్ .. ఇదైనా నిజమేనా లేక ...?

Salaar Trailer : సలార్ .. ఇదైనా నిజమేనా లేక ...?
X

ప్రభాస్ చాలా దూకుడుగా ఉన్నాడు. ఆ దూకుడుకు బ్రేక్ వేస్తూ.. ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ.. సలార్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన ఈ మూవీ డిసెంబర్ 22 విడుదల కాబోతోంది. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా కావడంతో మొదటి నుంచీ సలార్ పై భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకోవడానికే ఆలస్యం చేస్తున్నాం అని చెప్పారు. కానీ అదంత కన్విన్సింగ్ గా లేదు అని అందరికీ తెలుసు. బట్ పోస్ట్ పోన్ అయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు. అందుకే కొత్త డేట్ అయిన డిసెంబర్ 22న విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ దానికంటే ముందు మరో ఇంపార్టెంట్ విషయం ఉంది. అదే ట్రైలర్.





నిజానికి సలార్ మేకర్స్ ఎప్పుడూ చెప్పిన మాట మీద లేరు. అసలా మాటకొస్తే అసలు ఈ సినిమాకు సంబంధించిన మాటలేం చెప్పలేదు. చెప్పినవీ నెరవేర్చలేదు. టీజర్ విషయంలో ఫ్యాన్స్ ను చీట్ చేశారు. అందులో ఒక్కటి కూడా ప్రభాస్ క్లోజప్ షాట్ లేదు. ఇక ఇప్పుడు ట్రైలర్ విషయానికి వస్తే ఈ నెల 23న విడుదల చేస్తాం అని చెబుతున్నారు. కానీ అధికారికంగా మాత్రం ఏ వార్తా లేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఆ రోజు ఖచ్చితంగా ట్రైలర్ రావాల్సిందే అనుకుంటున్నారు. అందుకు కారణం ఈ 23న ప్రభాస్ బర్త్ డే ఉంది. ఆ తర్వాతి రోజు దసరా పండగ ఉంది. సో.. ఫ్యాన్స్ కు ఒకేసారి రెండు పండగలు కలిసొస్తున్నాయి. వీళ్లు ట్రైలర్ కూడా ఇస్తే మూడో పండగ అవుతుందనుకుంటున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకూ ఈ మూవీపై ఉన్న నెగెటివిటీ కూడా కాస్త తగ్గుతుంది. అలాగే బిజినెస్ యాంగిల్ తో పాటు ప్రమోషన్స్ కు కూడా పనికొస్తుందీ ట్రైలర్. మరి సలార్ మేకర్స్ ఈ ట్రైలర్ మాటైనా నిలబెట్టుకుంటారా లేదా అనేది చూడాలి.



Updated : 6 Oct 2023 4:20 PM IST
Tags:    
Next Story
Share it
Top