Home > సినిమా > ఇదేం తెలుగురా అయ్యా...ప్రభాస్ పరువు తీశావుగా

ఇదేం తెలుగురా అయ్యా...ప్రభాస్ పరువు తీశావుగా

ఇదేం తెలుగురా అయ్యా...ప్రభాస్ పరువు తీశావుగా
X

జూన్ 16న ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‎లో ప్రభాస్ , కృతి సనన్ జోడీగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఆల్ ఇండియన్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ మేకర్స్ టీజర్లు, ట్రైలర్లతో ప్రమోషన్‎లను ఓ రేంజ్‎లో చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ ఓం రౌత్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట్లో దుమారం రేపుతోంది. ప్రభాస్ పరువు తీశావు కదారా అంటూ డైరెక్టర్‎పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదేం తెలుగు రా బాబూ తెలుగు భాషను ఖూనీ చేశావు కదా అంటూ సోషల్ మీడియాలో ఓం రౌత్‎ను ట్రోల్ చేస్తున్నారు .

ఆదిపురుష్ టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా ఏదో రకంగా ట్రోలింగ్‎కు గురవుతూనే ఉంది. తాజాగా డైరెక్టర్ ఓం రౌత్ ట్విటర్‎లో ప్రమోషన్‎లో భాగంగా చేసిన ట్వీట్ రచ్చ రచ్చ అవుతోంది. ఆ ట్వీట్‎లో ఆదిపురుష్ రిలీజ్ అవుతున్న అన్ని భాషల పదాలు ఉన్నాయి. హిందీలో "హమ్ హై కేసరీ.. క్యా బరాబరీ" అనే లైన్ ఉంది. దీనినే తెలుగులోనూ రాశాడు డైరెక్టర్. తెలుగులో దానిని శక్తి వంతులం..భక్తి మంతులం అని ఉండాలి. కానీ అందులో పదాలన్నీ చెల్లా చెదురై అసలు అర్థాన్నే మార్చేశాయి. ఎవరికీ అర్థం కాకుండా ఉన్నాయి. తెలుగు హీరోతో సినిమా చేస్తూ తెలుగు భాష అంటే ఇంత చిన్న చూపా ప్రభాస్ పరువు తీస్తున్నారంటూ తప్పును ఎత్తి చూపుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ఓంరౌత్‎ను నెట్టింట్లో ఓ రేంజ్‎లో ఆడుకుంటున్నారు. తెలుగుకు కనీస మర్యాద కూడా ఇవ్వరా అంటూ అభిమానులు మండిపడుతున్నారు. అంతే కాదు కొంద మంది నెటిజన్స్ తెలుగు హీరోలను తిట్టిపోశారు. మన హీరోలకు ఇవేమీ పట్టవని..రూ.100 కోట్లు వచ్చాయా లేదా అన్నదే ముఖ్యమని విమర్శిస్తున్నారు.

ఓం రౌత్ చేసిన ట్వీట్‎లో సినిమా విడుదల అవుతున్న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషలలో పదాలు ఉన్నాయి. సాధారణంగానే నార్త్ వారు దక్షిణాది భాషలను పెద్దగా లెక్కచేయరు అన్న విమర్శులు ఉన్నాయి. ఇప్పడు ఈ ట్వీట్ అందుకు ఆజ్యం పోసినట్లయింది. ఈ ట్వీట్ చూస్తే తెలుగు, తమిళం భాషలు సూసైడ్ చేసుకుంటాయని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆదిపురుష్ టీమ్‎లో అసలు తెలుగువారు ఉన్నారా లేదా?..పీఆర్ టీమ్‎కు అసలు కామన్ సెన్స్ ఉందా అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్షన్ ఇస్తున్నారు.


Updated : 3 Jun 2023 11:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top