Home > సినిమా > Prabhas : రాజమౌళిని అవమానించిన ప్రభాస్

Prabhas : రాజమౌళిని అవమానించిన ప్రభాస్

Prabhas  : రాజమౌళిని అవమానించిన ప్రభాస్
X

ప్రభాస్.. ఇప్పుడంటే ప్యాన్ ఇండియన్ రేంజ్ ఇమేజ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ కొన్నేళ్ల క్రితం అతనికి ఇంత రేంజ్ ఉందా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి. మాస్ హీరోకు తగ్గ కటౌట్ ఉన్నా.. కంటెంట్ విషయంలో ఎప్పుడూ వెనకే ఉండేవాడు. పూరీ జగన్నాథ్ తో చేసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలతో అతని డిక్షన్ బెటర్ అయింది. అటుపై రాజమౌళి ఛత్రపతి మూవీ అతని కటౌట్ ను కరెక్ట్ గా వాడుకుంది. ఈ మూవీతో ప్రభాస్ కు పెరిగిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. చెబితే ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో కానీ.. ఛత్రపతి కంటే ముందు అతని మార్కెట్ అప్పటి వరుణ్ సందేశ్ కంటే తక్కువ అనేది కాదనలేని నిజం. ఛత్రపతి తర్వాత ప్రభాస్ టాప్ హీరోల లిస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. అంటే అతని రేంజ్ మారడంలోనూ పెరగడంలోనూ పూరీ పాత్ర 30శాతం ఉంటే.. రాజమౌళి పాత్ర 70శాతం ఉంది. పైగా బాహుబలితో ప్రభాస్ ను ప్యాన్ ఇండియా నుంచి ఏకంగా ఒకేసారి గ్లోబల్ స్టార్ గా మార్చాడు రాజమౌళి. బాహుబలి తర్వాత ప్రభాస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకున్నారు అంటే అందుకు కారణం కేవలం రాజమౌళి అనేది ఎవరూ కాదనలేని సత్యం. అలాంటి రాజమౌళిని అవమానిస్తూ తాజాగా ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఆయన ఫ్యాన్స్ కు కూడా నచ్చడం లేదు.

యస్.. తాజాగా సలార్ కు సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ లో భాగంగా ప్రభాస్ తన 21యేళ్ల కెరీర్ లో తను చూసిన ఓన్లీ బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నాడు. ప్రశాంత్ నీల్ చేసిందే మూడు సినిమాలు. అందులో రెండు కేజీఎఫ్ 1 అండ్ 2. అలాంటి దర్శకుడిని తన కెరీర్ లోనే బెస్ట్ అనడం ఎంత వరకూ సమంజసం అని అంతా ప్రశ్నిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ మాటలు రాజమౌళి ముందే అన్నాడు. అప్పటికి ఏం ఫీల్ అయ్యాడో కానీ ఖచ్చితంగా ప్రభాస్ వ్యాఖ్యలు రాజమౌళి లాంటి లెజెండరీ దర్శకుడిని అవమానించినట్టుగానే చెప్పాలి. రాజమౌళి లేకుంటే ప్రభాస్ అంత త్వరగా మాస్ ఇమేజ్ వచ్చేదే కాదు. అలాంటి వ్యక్తి ముందే మరో దర్శకుడిని ది బెస్ట్ అనడం మాత్రం అస్సలు బాలేదని ఇండస్ట్రీలోనూ చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ ప్రభాస్ కు పర్సనల్ గా ఎలాంటి మచ్చా లేదు. ట్రూ జెంటిల్మన్ అంటారు. అలాంటి వాడు సడెన్ గా ఇలా రాజమౌళిని ఇన్ సల్ట్ చేస్తూ ప్రశాంత్ నీల్ ను బెస్ట్ డైరెక్టర్ అనడం ఎవరికీ నచ్చడం లేదు.

నిజానికి సలార్ ట్రైలర్ కు జస్ట్ బావుంది అన్న టాక్ తప్ప.. అద్భుతం అని ఎవరూ చెప్పలేదు. దీనికి తోడు కన్నడ దర్శకుడు చేసిన ఈ సినిమాను కన్నడవాళ్లే ఓన్ చేసుకోవడం లేదు. అక్కడి స్టార్ హీరోలు కూడా సలార్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ మూవీకి పోటీగా తమ సినిమాలూ విడుదల చేస్తున్నారు. ఓ రకంగా తెలుగు ఆడియన్స్ మాత్రమే ఎక్కువగా మోయబోతోన్న సినిమా ఇది. ఇలాంటి తరుణంలో తెలుగు దర్శకులను.. అది కూడా రాజమౌళి లాంటి లెజెండరీ డైరెక్టర్ ముందు టాలీవుడ్ మేకర్స్ ను ఇన్ సల్ట్ చేస్తూ ప్రశాంత్ నీల్ బెస్ట్ అనడం ప్రభాస్ అభిమతానికే వదిలేయాలేమో.


Updated : 17 Dec 2023 11:30 AM IST
Tags:    
Next Story
Share it
Top