Home > సినిమా > నవ్వు ఆపుకోలేకపోతున్నా..అనుష్క సినిమాపై ప్రభాస్ కామెంట్స్

నవ్వు ఆపుకోలేకపోతున్నా..అనుష్క సినిమాపై ప్రభాస్ కామెంట్స్

నవ్వు ఆపుకోలేకపోతున్నా..అనుష్క సినిమాపై ప్రభాస్ కామెంట్స్
X

ఒకప్పుడు వరుస సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలింది అగ్రకథానాయిక అనుష్క. రాజమౌళి బాహుబలి సినిమాతో ఈ భామ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో అమ్మడు చేతినిండా మూవీస్‎తో ఫుల్ బిజీగా ఉంటుందని భావించారు. కానీ ఒకటిరెండు సినిమాలకే పరిమితం అయ్యింది స్వీటీ. అనుష్క చివరిసారిగా నిశ్శబ్దం సినిమాలో కనిపించింది. మళ్లీ మూడేళ్ల గ్యాప్ తరువత అనుష్క సిల్వర్ స్క్రీన్‏పై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. నూతన దర్శకుడు మహేష్ దర్శకత్వంలో వస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో మెరవబోతోంది. జాతిరత్నాలు సినిమాతో ఫేమస్ అయిన నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీ సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. లేటెస్టుగా ఈ ట్రైలర్‎పై తన ఇన్‎స్టా స్టోరీలో ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

కామెడీ ఎంటర్టైనర్‎గా త్వరలో విడుదల కాబోతోన్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ ట్రైలర్ ఆధ్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‎ చూస్తే నవీన్, అనుష్క తమ పెర్ఫార్మెన్స్‎తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. లేటెస్టుగా ఈ ట్రైలర్‎పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కామెంట్ చేశారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్ చూసి నవ్వు ఆపుకోలేకపోయానని తన ఇన్‎స్టా స్టోరీలో మెన్షన్ చేశారు ప్రభాస్. స్వీటీ, నవీన్ పెర్ఫార్మెన్స్ అదుర్స్ అంటూ ప్రశంసలు కురిపించారు డార్లింగ్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది.


Updated : 22 Aug 2023 2:35 PM IST
Tags:    
Next Story
Share it
Top