Home > సినిమా > ఆమెతో కలిసి నటించాలన్న కోరిక ఇప్పటికీ తీరింది : ప్రభాస్

ఆమెతో కలిసి నటించాలన్న కోరిక ఇప్పటికీ తీరింది : ప్రభాస్

ఆమెతో కలిసి నటించాలన్న కోరిక ఇప్పటికీ తీరింది : ప్రభాస్
X

ప్రభాస్.. ప్రస్తుతం సలార్, కల్కి2898ఏడీ సినిమాలు చేస్తున్నారు. సలార్ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుండగా.. కల్కి వచ్చే ఏడాది విడుదలకానుంది. ఇటీవల రిలీజైన కల్కి2898 ఏడీ మూవీ గ్లింప్స్ యూట్యూబ్ను షేక్ చేసింది. ఈ మూవీ హీరోయిన్గా బాలీవుడ్ భామ దీపికా పదుకొనె నటుస్తుంది. కాగా దీపికపై ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.





దీపికా పదుకొనె అద్భుతమైన నటి అని ప్రభాస్ అన్నారు. ‘‘దీపిక పదుకొనె చాలా అందంగా ఉంటుంది. ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కల్కి సెట్స్‌లోకి అడుగుపెట్టిన ప్రతిసారీ అక్కడున్న వారందరిలోనూ ఉత్సాహం వస్తుంది. ఆమెతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకునేవాన్ని. అది ఇప్పుడు కుదిరింది’’ అని ప్రభాస్ చెప్పారు.





ఇక ఇటీవల రిలీజైన ప్రభాస్ కల్కి 2898 AD మూవీ గ్లింప్స్ యూట్యూబ్ను షేక్ చేసింది. హాలీవుడ్ లెవల్లో కల్కి గ్లింప్స్ అదిరిందంటూ సినీ ప్రముఖులు సైతం కామెంట్స్ చేశారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‎తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా.. వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. కాగా 2024లో ఈ మూవీ రిలీజ్ కానుంది.


Updated : 3 Aug 2023 7:35 AM IST
Tags:    
Next Story
Share it
Top