మిర్చి లాంటి హీరోతో ఘాటైన రొమాన్స్
X
వెండితెరపై మిర్చి లాంటి హాటైన హీరో, బాహుబలంతో దేన్నైనా ఎదుర్కొనే ధీరుడు. ఎంత సమరమైనా అతను సలార్ లా సై అంటే శతృవులంతా సాహో అనక తప్పదు. అంతటి ధీరుడు కాబట్టే డార్లింగ్ స్టార్ ప్రభాస్ అంటే ఫ్యాన్స్ కు అంత ఇష్టం. అయితే కొన్నాళ్లుగా డార్లింగ్ నుంచి ఫ్యాన్స్ కు ఒకటి మిస్ అవుతోంది. అదే రొమాన్స్. రాధేశ్యామ్ ఆ లోటును తీరుస్తుందనుకుంటే పూర్తిగా నీరసంగా ఉండటంతో అభిమానులు అంతగా శాటిస్ ఫై కాలేదు. బట్ ఈ సారి ఇప్పటి వరకూ చేయనంత రొమాన్స్ తో రాబోతున్నాడట డార్లింగ్. టైటిల్ చూసి, ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ చూసి ఇది కూడా కేవలం యాక్షన్ కంటెంటేనా అనుకున్న వాళ్లకు కాదు.. అని చెప్పేదే ఈ వార్త.
ప్రభాస్ సినిమా అంటే కటౌట్ కు తగ్గట్టుగా యాక్షన్ ఉండాలి. అదే టైమ్ లో మిర్చి లాంటి రొమాన్స్ కూడా పండాలి. బట్ ఈ రొమాన్స్ కొన్నాళ్లుగా మిస్ అవుతోంది. సలార్ లో అయితే ఆయన లుక్ కూడా మారలేదు. డైలాగ్స్ అస్సల్లేవు. అంతకు ముందు వచ్చిన రాధేశ్యామ్ రొమాంటిక్ ట్రాక్ కాస్తా క్యాన్సర్ బారిన పడి ఎటూ కాకుండా పోయింది. ఇక ఇప్పుడు కల్కి అంటూ వస్తున్నాడు. ఈ మే 9న విడుదల కాబోతోన్న కల్కి టీజర్ ను మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే టీజర్ కట్ పూర్తయిందని టాక్. మొత్తం ఒకటిన్నర నిమిషం పాటు ఈ టీజర్ కనిపించబోతోందని టాక్. గతంలో వచ్చిన గ్లింప్స్ ను మించి.. సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేలా ఈ టీజర్ ఉండబోతోందంటున్నారు. ఇక ఈ టీజర్ అప్డేట్ తో పాటు కల్కి లో రొమాంటిక్ ట్రాక్ గురించి కూడా వినిపిస్తోంది.
ఈ మూవీలో దీపికా పదుకొనె మెయిన్ హీరోయిన్ అయినా.. ప్రభాస్ మాత్రం మరో హీరోయిన్ అయిన దిశా పటానీతో రొమాంటిక్ ట్రాక్ నడిపిస్తాడట. వీరి మధ్య స్ట్రాంగ్ లిప్ లాక్స్ తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా ఉంటాయని టాక్. దిశా పటానీకి ఇలాంటి సీన్స్ కొత్తేం కాదు. ప్రభాస్ కూడా రాధేశ్యామ్ లో ఓ పాటలో ఘాటుగానే కనిపించాడు. బట్ యూనివర్సల్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కల్కిలో హాలీవుడ్ రేంజ్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయని ఇంటర్నల్ సోర్స్ నుంచి వినిపిస్తోన్న న్యూస్. మామూలుగా చాలా సిగ్గరిగా కనిపించే డార్లింగ్ మరి ఇలాంటి సీన్స్ లో ఎలా ఉంటాడో కానీ.. కల్కిలో కొత్త ప్రభాస్ ను చూస్తాం అని చెబితే ఏదో అనుకున్నారు.. ఇదేఅన్నమాట అంటూ కొన్ని ఫన్నీ కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్ రొమాన్స్ తో దిశా పటానీకి తెలుగులో బ్రేక్ వస్తుందేమో చూడాలి.