Home > సినిమా > Prabhas : కల్కి మూవీ తర్వాత ప్రభాస్ పెళ్లి..అమ్మాయి ఎవరో తెలిసిపోయింది?

Prabhas : కల్కి మూవీ తర్వాత ప్రభాస్ పెళ్లి..అమ్మాయి ఎవరో తెలిసిపోయింది?

Prabhas  : కల్కి మూవీ తర్వాత ప్రభాస్ పెళ్లి..అమ్మాయి ఎవరో తెలిసిపోయింది?
X

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే అందరూ టక్కున ప్రభాస్ పేరు చెబుతారు. ఎన్నో రోజుల నుంచి అదిగో పెళ్లి...ఇదిగో పెళ్లి అంటూ ఊరిస్తూనే ఉన్నారు. బాహుబలి తర్వాత అనుష్కతో పెళ్లంటూ వార్తలొచ్చాయి. ఆదిపురుష్ తర్వాత కృతిసనన్‌తో పెళ్లంటూ అందరూ చెప్పుకున్నారు. ఆఖరికి అవన్నీ పుకార్లేనని తెలిసింది.

ఆ మధ్య కృష్టంరాజు భార్య శ్యామలదేవి ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ప్రభాస్ పెళ్లి కచ్చితంగా ఉంటుందని, దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని చెప్పుకొచ్చింది. దీంతో ప్రభాష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తాజాగా ప్రభాస్ పెళ్లిపై మరో వార్త వైరల్ అవుతోంది. 'కల్కి 2898ఏడీ' మూవీ తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని తెలుస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో కల్కి మూవీని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ మే 9వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తర్వాతే ప్రభాస్ పెళ్లి ఉంటుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.





టాలీవుడ్‌లోకి ఈశ్వర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మంచి విజయాన్ని అందుకున్నాడు. రెండో సినిమా వర్షంతో కృష్టం రాజు వారసుడు వచ్చాడని అందరూ అనుకున్నారు. రాజమౌలి దర్శకత్వంలో బాహుబలి వచ్చిన తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు 'కల్కి 2898ఏడీ' మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. చేతి నిండా సినిమాలున్నా ఇంట్లో శుభకార్యం మాత్రం జరగడం లేదని, ప్రభాస్ పెళ్లి జరిగేదెప్పుడు? బుల్లి ప్రభాస్ పుట్టేదెప్పుడని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అనుష్కతో ఆ మధ్య ప్రభాస్ ప్రేమాయణం నడిపాడనే చర్చ జోరుగా వినిపించేది. ఎక్కడ చూసినా ఆ జంట గురించే టాక్ నడిచేది. అనుష్క కూడా ప్రభాస్‌తో ఎంతో చనువుగా ఉండటంతో సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ప్రభాస్ పెళ్లి ఖాయం అని అనుకుంటుండగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌తో జత కట్టాడు. కృతిసనన్ కూడా ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాత మౌనంగా ఉండిపోయింది.

సలార్ మూవీ తర్వాత సోషల్ మీడియాలో ప్రభాస్ మరదలు ప్రత్యక్షమైంది. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను.. 'మీరు ప్రభాస్ మరదలే కదా.. ప్రభాస్ బర్త్ డేకి విషెస్ చెబుతూ 'బావ' అని పోస్ట్ పెట్టారు కదా' అని అడిగారు. దానికి ఆమె బదులిస్తూ.. కేవలం తన ఫోన్‌లో మాత్రమే స్టేటస్ పెట్టుకున్నట్లు చెప్పింది. తనకు ప్రభాస్ బావ అవుతారని ఒప్పుకుంది. దీంతో అందరూ ఆమెతోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఫిక్స్ అయ్యారు. రెబల్ అభిమానులు ఆమెను వదినమ్మ అని కూడా పిలిచేశారు. మరి ప్రభాస్ పెళ్లి చేసుకునేది ఆమెనేనా అనేది తెలియాల్సి ఉంది.

ప్రభాస్‌పై చాలా మంది మనసు పారేసుకున్నవారు ఉన్నారు. ప్రభాస్‌తో ఏడడుగులు వేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఆ మధ్యన పీవీ సింధు కూడా తనకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రభాస్, తాను.. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పింది. ఆ సమయంలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఏదో ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఏం జరగలేదు. మొత్తానికి ప్రభాస్.. పెళ్లి ఊసెత్తకుండా ఉండిపోతున్నారు. అయితే 'కల్కి' మూవీ విడుదలైన తర్వాత ప్రభాస్ పెళ్లి గురించి ఏదోక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Updated : 4 March 2024 3:02 PM IST
Tags:    
Next Story
Share it
Top