RAJASAAB: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే
X
పండుగ రోజున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రభాస్ -మారుతి కాంబినేషన్‍లో రూపొందుతున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‍ను ఈ (జనవరి 15న)ఉదయం 7 గంటల 8 నిమిషాలకు రివీల్ చేసింది. రాజాసాబ్ అనే టైటిల్‌తో లుంగీతో ఉన్న ప్రభాస్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. టైటిల్ ను రిలీజ్ చేసేందుకు చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశామని, చివరకు ఈ రోజున రిలీజ్ చేశామని డైరెక్టర్ మారుతీ ట్వీట్ చేశారు. డార్లింగ్ ని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూడబోతున్నారు.. ప్రామిస్ అని పోస్ట్ చేశారు. అసలు సిసలు సంక్రాంతి అల్లుడు గెటప్‌లో ఉన్న ప్రభాస్ ను చూసి డార్లింగ్ ఫ్యాన్స్.. సంబరపడిపోతున్నారు.
Probably the best #Sankranthi I'm having :)
— Director Maruthi (@DirectorMaruthi) January 15, 2024
It's official now... presenting #TheRajaSaab to all of you 🤗🤗
Need all of ur blessings ♥️
Chaala days nunchi, eppudu eppudu ani waiting. Finally it happened today. Darling ni ela chudali anukunnaro… ala choodabotunnaru… Promise !!… pic.twitter.com/02nkHBbpk3
రెండ్రోజుల ముందు ఉదయించే సూర్యుడు, అరుస్తున్న కోడిపుంజుతో టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది మూవీ యూనిట్. “సంక్రాంతి రోజు.. సూర్యోదయంతో పాటు.. రెబల్ స్టార్ కూడా త్వరగా ఉదయించి మీ అందరికీ డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ జనవరి 15వ తేదీ ఉదయం 7 గంటల 8 నిమిషాలకు ఆవిష్కరించనున్నాం. ప్రభాస్ పొంగల్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండి” అని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ఈ మూవీ హారర్ కామెడీగా రానుందని టాక్ వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ మళ్లీ ఫుల్ ఫన్ ఉండే క్యారెక్టర్ చేస్తున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మొదట ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ప్రభాస్ పాన్ వరల్డ్ లెవల్లో ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను భారీ కటౌట్ మాదిరిగా లాంఛ్ చేశారు మేకర్స్. ఈ రోజు ఉదయం 6:30 గంటలకి వెంప కాసి కోడి పందెం బరి పెడమెరం, భీమవరం లో డిజిటల్ కటౌట్‌ని లాంఛ్ చేశారు. మొదటి సారి గా ఒక డిజిటల్ కటౌట్ ను లాంఛ్ చేయడం, అది కూడా ప్రభాస్ మూవీ కి కావడం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.