Prabhas Kalki : కల్కి నుంచి ప్రభాస్ పోస్టర్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. భారతీయ ఇతిహాసం అయిన మహాభారతం కాలం నుంచి ప్రారంభమై 2898వ సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీని సినిమాగా రూపొందిస్తున్నారు.
'కల్కి 2898 ఏడీ' మూవీ ఈ ఏడాది మే 9వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. ఆ గ్లింప్స్ వీడియో మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ మూవీలో ప్రభాస్ చేసే యాక్షన్ స్టంట్స్ చూస్తే అభిమానులకు పూనకాలేనని మేకర్స్ తెలిపారు. తాజాగా మహాశివరాత్రి పండగ సందర్భంగా ప్రభాస్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ప్రభాస్ లుక్‌తో పాటుగా సినిమాలో ఆయన పేరును మేకర్స్ తెలిపారు.
ఈ మూవీలో భైరవ పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నారు. ప్రభాస్‌కు సంబంధించిన పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. కాశీ భవిష్యత్తు వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం అంటూ మేకర్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. పోస్టర్‌లో ప్రభాస్ లుక్‌ను చూసి అందరూ వావ్ అని అంటున్నారు. ఫ్యుచర్ స్టైల్ గాగుల్స్, స్లీవ్ లెస్ డ్రెస్, కండలు తిరిగిన బాడీపై టాటూ, పోనీ టైల్ హెయిర్‌తో ప్రభాస్ అదిరిపోతున్నాడు. పోస్టర్‌లో ప్రభాస్‌ను చూసినవారంతా వేరేలెవల్ అని కామెంట్స్ చేస్తున్నాడు.
From the future streets of Kasi, Introducing 'BHAIRAVA' from #Kalki2898AD.#Prabhas #Kalki2898ADonMay9@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @shreyasgroup pic.twitter.com/2hFB6PWk27
— Shreyas Media (@shreyasgroup) March 8, 2024