Home > సినిమా > ఫస్ట్ లుక్ డిలీట్.. కామిక్ బుక్ లీక్స్.. Get ready.. ఇవాళ అర్ధరాత్రి ప్రాజెక్ట్-కె ఫస్ట్ గ్లింప్స్

ఫస్ట్ లుక్ డిలీట్.. కామిక్ బుక్ లీక్స్.. Get ready.. ఇవాళ అర్ధరాత్రి ప్రాజెక్ట్-కె ఫస్ట్ గ్లింప్స్

ఫస్ట్ లుక్ డిలీట్.. కామిక్ బుక్ లీక్స్.. Get ready.. ఇవాళ అర్ధరాత్రి ప్రాజెక్ట్-కె ఫస్ట్ గ్లింప్స్
X

ప్రాజెక్ట్ కె సినిమా కోసం ప్రపంచం ఎదురుచూస్తుంది. ఇప్పటి వరకు ఆ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్, పోస్టర్స్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రముఖ నటులు నటిస్తుండటంతో.. హైప్ మరింత పెరిగింది. అంతేకాకుండా టైమ్ ట్రావెట్ అంటూ లీక్ అయిన స్టోరీ లైన్.. ఆదిపురుష్ సినిమా ఫెయిల్ కావడంతో ప్రాజెక్ట్ కె పైనే హోప్స్ పెట్టుకున్నారంతా. మరోవైపు అమెరికాలో ఇప్పటికే ప్రాజెక్ట్ కె సందడి మొదలయింది.

ప్రతిష్ఠాత్మకమైన శాన్ డియాంగో కామిక్ కాన్ ఈవెంట్ వేదికపై ఈ చిత్రాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కె చరిత్ర సృష్టించింది. ఇవాళ అర్ధరాత్రి 1.30 నుంచి 2.30 మధ్య ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవుతుందని మూవీ టీం పేర్కొంది. అదే టైంలో సోషల్ మీడియాలోనూ విడుదల చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో బుధవారం (జులై 19) ప్రాజెక్ట్ కె నుంచి ప్రభాస్ ఫస్ట్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఇది అభిమానులను నిరాశ పర్చగా.. దాన్ని ఇవాళ డిలీట్ చేసింది. దాంతో గ్లింప్స్ పై ఆసక్తి నెలకొంది.



Updated : 20 July 2023 10:25 PM IST
Tags:    
Next Story
Share it
Top