Home > సినిమా > సలార్ మేనియా.. భారీ ధరకు డిజిటల్ రైట్స్..

సలార్ మేనియా.. భారీ ధరకు డిజిటల్ రైట్స్..

సలార్ మేనియా.. భారీ ధరకు డిజిటల్ రైట్స్..
X

ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మరో మూవీ సలార్. ఆదిపురుష్ ఆశించిన స్థాయిలో ఆడకపోగా.. ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. ప్రభాస్ రాముడిగా నటించన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపలేకపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సలార్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి.

కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో సలార్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ కోసం పలు సంస్థలు తీవ్ర పోటీపడ్డాయట. చివరకు ఓ సంస్థ 200 కోట్లకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. కేజీఎఫ్‍ను నిర్మించిన హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్.. ఈ మూవీని కూడా నిర్మిస్తోంది.








Updated : 15 July 2023 1:58 PM IST
Tags:    
Next Story
Share it
Top