Home > సినిమా > బొమ్మ బ్లాక్బస్టర్.. 6 రోజుల్లో 500 కోట్లు.. మరో 100 కోట్లు వస్తే

బొమ్మ బ్లాక్బస్టర్.. 6 రోజుల్లో 500 కోట్లు.. మరో 100 కోట్లు వస్తే

బొమ్మ బ్లాక్బస్టర్.. 6 రోజుల్లో 500 కోట్లు.. మరో 100 కోట్లు వస్తే
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సినిమా సలార్- సీజ్‍ ఫైర్ (పార్ట్ 1) బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 22వ తేదీన రిలీజైన ఈ సినిమా.. రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. 2023లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఐదు రోజులకు కలిపి ఈ సినిమా.. రూ.500 కోట్లకు పైగా వసూలు రాబట్టి.. రూ.500 కోట్ల క్లబ్​లోకి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.176 కోట్లు, రెండో రోజు రూ.119 కోట్ల, మూడో రోజు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ రికార్డులను దేవా రిపేర్ చేస్తున్నాడని క్యాప్షన్ పెట్టింది. మరో రూ.100 కోట్లు వస్తే.. సలార్ బ్రేక్ ఈవెన్ అయినట్లేనని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.





Updated : 28 Dec 2023 4:57 PM IST
Tags:    
Next Story
Share it
Top