Home > సినిమా > కేజీఎఫ్లో మిగిలిన ముక్కలతో సలార్

కేజీఎఫ్లో మిగిలిన ముక్కలతో సలార్

కేజీఎఫ్లో మిగిలిన ముక్కలతో సలార్
X

సలార్ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూశారు. ఎట్టకేలకు ట్రైలర్ రిలీజ్ అయ్యింది కానీ.. వారి రేంజ్ను మాత్రం అందుకోలేకపోయింది. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలుండగా.. ట్రైలర్ ఆ అంచనాలను తలకిందులు చేసింది. ట్రైలర్ను చూస్తుంటే కేజీఎఫ్ను చూస్తున్నట్లే ఉంది. ఇందులో కూడా కుర్చీ కోసం పోరాటమే. ట్రైలర్లో ప్రభాస్ కంటే విలన్ పృథ్వీరాజే ఎక్కువ హైలెట్ అవ్వడం గమనార్హం. 3 నిమిషాల 47 సెకన్ల ట్రైలర్లో ప్రభాస్ 2 నిమిషాల 19 సెకన్లకు వరకు కన్పించడు.

ప్రభాస్ ట్రైలర్లో కన్పించిన్నంత సేపైనా దుమ్ములేపుతారనుకుంటే అదీలేదు.‘‘ పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి బయటకు ఎవడు పోతాడని కాదు.. లోపలికి ఎవడు వస్తాడని. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్.’’ ఇవి ఈ ట్రైలర్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్. దీంతో ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు. కేజీఎఫ్ రేంజ్లో ట్రైలర్ ఊహించిన ఫ్యాన్స్కు ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్లోని మిగిలిపోయిన రీల్ను చూపించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ - సలార్ మధ్య ఎటువంటి సంబంధం లేదని ప్రశాంత్ నీల్ చెప్పినా.. ట్రైలర్ మాత్రం అచ్చు కేజీఎఫ్ లాగే ఉంది.

సలార్ ట్రైలర్పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కేజీఎఫ్ తీయగా మిగిలిపోయిన పార్ట్ అని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు ప్రభాస్కు మరో ఫ్లాప్ అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనిపై మూవీ యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్గా చేస్తున్నాడు. టీనూ ఆనంద్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Updated : 1 Dec 2023 8:09 PM IST
Tags:    
Next Story
Share it
Top