Home > సినిమా > సలార్ మూవీ మొత్తం లీక్ ..!

సలార్ మూవీ మొత్తం లీక్ ..!

సలార్ మూవీ మొత్తం లీక్ ..!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు డార్లింగ్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఆడియెన్స్‎లో భారీ హైప్ నెలకొంది. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సిరీస్‎తో టాప్ డైరెక్టర్‎గా మారిపోయాడు. అలాంటి దర్శకుడు, ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోతో చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక సలార్ చిత్రానికి ఎంతటి క్రేజ్ ఉందో చెప్పేందుకు.. మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక నిదర్శనం. యూఎస్‎లో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇప్పటికే వన్ మిలియన్ వసూళ్లను దాటేసింది. ఇక ఓపెనింగ్ డే సలార్ రూ.200 కోట్లు వసూళ్లను ఈజీగా అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. సలార్ కూడా కెజిఎఫ్ కథలో భాగమే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.





సలార్ మూవీపై, వస్తున్న రూమర్స్‎పై యూనిట్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ , కెజిఎఫ్ యూనివర్స్‏లో భాగంగా సలార్ తెరకెక్కిందని తెలుస్తుంది. సలార్‎లో విలన్ గా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఆయనకు ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఉంటుందని తెలుస్తుంది . ఫస్ట్ హాఫ్‎లో ఎక్కువ భాగం పృథ్విరాజ్ మీదే నడుస్తుందనేది టాక్ . సెకండ్ హాఫ్‎లో ప్రభాస్ లెవల్ ఏంటో చూపించేలా ఉంటుందట. అలాగే సలార్‎కి మరికొన్ని పార్ట్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై జగపతిబాబు స్వయంగా క్లారిటీ కూడా ఇచ్చారు . సలార్ టీజర్‎లో కూడా ఒక హింట్ ఇచ్చారు . కెజిఎఫ్ మూవీకి సంబంధించిన ఆనవాళ్లు సలార్ టీజర్లో ఉన్నాయి. కనుక కెజిఎఫ్ కథలో భాగంగా సలార్ తెరకెక్కుతోందని స్పష్టమవుతుంది . ఇక ఈ చిత్రంలో ప్రభాస్‏కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‎గా సలార్ విడుదల కానుంది. కేజీఎఫ్‎ను మించేలా సాలార్ ఉంటుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.






Updated : 30 Aug 2023 8:32 PM IST
Tags:    
Next Story
Share it
Top