Home > సినిమా > Kalki 2898 AD:‘కల్కి 2898 AD' ట్రైలర్ డేట్ ఫిక్స్

Kalki 2898 AD:‘కల్కి 2898 AD' ట్రైలర్ డేట్ ఫిక్స్

Kalki 2898 AD:‘కల్కి 2898 AD ట్రైలర్ డేట్ ఫిక్స్
X

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా మైథ‌లాజిక‌ల్ అండ్ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా మే 9 గ్రాండ్ గా రిలీజ్ కానుండగా.. ఈ సినిమాపై అభిమాన‌ుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ తో కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంద‌నే భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇక తాజాగా మూవీ యూనిట్ కల్కి సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చింది. కల్కి సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు ఆసక్తిగా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా మే 9న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమాని నిర్మాత అశ్విని దత్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, రానా, రాజేంద్రప్రసాద్.. పలువురు స్టార్స్ నటిస్తుండగా మరికొంతమంది స్టార్స్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని సమాచారం. కల్కి సినిమా మహాభారతంలో మొదలై 2898వ సంవత్సరంలో ముగుస్తుందని, 6000 సంవత్సరాల మధ్య జరిగే కథ అని ఇటీవల దర్శకుడు ఓ ఈవెంట్ లో చెప్పి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు.

Updated : 2 March 2024 3:47 PM GMT
Tags:    
Next Story
Share it
Top