Home > సినిమా > రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం.. నిజమెంత..?

రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం.. నిజమెంత..?

రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం.. నిజమెంత..?
X

అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో కోట్ల మంది కల నిజమైంది. ఈ నెల 22న జరగనున్న రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువలా నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే రామ మందిర నిర్మాణానికి దేశ విదేశాలకు చెందిన భక్తులు భారీగా విరాళాలు ఇచ్చారు. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయోధ్య రామాలయానికి భారీ విరాళం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి హీరో ప్రభాస్ రామ మందిరానికి రూ.50 కోట్లు ఇచ్చారని ప్రకటించారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులందరికీ ప్రభాస్ భోజనాలు సమకూర్చేందుకు అంగీకరించారని చెప్పారు.

ప్రభాస్ భారీ విరాళానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వాటిపై ప్రభాస్ టీం స్పందించింది. అవన్నీ గాలి వార్తలని కొట్టిపారేసింది. ప్రభాస్ అంత భారీ మొత్తం విరాళం ఇవ్వలేదని, భోజనాలు స్పాన్సర్ చేస్తానని కూడా చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది. అలాంటి వార్తలను నమ్మొద్దని స్పష్టం చేసింది.

సలార్ మూవీతో ఘన విజయం అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌తో ‘కల్కీ 2898 ఏడీ’, మారుతీతో ‘రాజాసాబ్‌’ కోసం పని చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ‘సలార్‌ శౌర్యాంగపర్వం’ కోసం ప్రభాస్ సిద్ధం కానున్నారు.




Updated : 19 Jan 2024 7:31 PM IST
Tags:    
Next Story
Share it
Top