Home > సినిమా > 'కన్నప్ప' కోసం మూడు రోజులు శివుడిగా ప్రభాస్!

'కన్నప్ప' కోసం మూడు రోజులు శివుడిగా ప్రభాస్!

కన్నప్ప కోసం మూడు రోజులు శివుడిగా ప్రభాస్!
X

మంచు విష్ణు కన్నప్ప మూవీని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. హిస్టారికల్ సోషియో ఫాంటసీ మూవీగా కన్నప్పను తెరకెక్కించేందకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇందులో భారీ తారగణం నటిస్తోంది. ప్రభాస్, నయనతార, మధుబాల, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి స్టార్స్ ఇందులో కనిపించనున్నారు. ఇందులో శివుడిగా డార్లింగ్ ప్రభాస్ కనిపించనున్నట్లు సమాచారం. పార్వతి పాత్రలో నయనతార నటించనున్నట్లు తెలుస్తోంది.

కన్నప్ప మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ లాంగ్ షెడ్యూల్‌ను ఈ మధ్యనే ఫినిష్ చేశారు. న్యూజిలాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన షాట్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కైలాసంలోని శివపార్వతులకు సంబంధించిన షాట్స్, అదేవిధంగా క్లైమాక్స్‌కు సంబంధించిన సీన్స్ తీసేందుకు ప్రణాళిక వేశారు. అందులో శివునిగా తన క్యారెక్టర్ సీన్స్ పూర్తి చేసేందుకు ప్రభాస్ వారికి మూడు రోజుల పాటు కాల్ షీట్స్ ఇచ్చినట్లు సమాచారం.

ఫిబ్రవరి 17, 18, 19వ తేదీల్లో ప్రభాస్ కన్నప్ప మూవీ సెట్స్‌లో పాల్గొంటాడని టాక్ వినిపిస్తోంది. ఆ మూడు రోజుల్లోనే ప్రభాస్‌కు సంబంధించిన సీన్స్ పూర్తి చేయనున్నారట. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఆనందిస్తున్నారు. మరి అందరూ అనుకున్నట్లుగా ప్రభాస్ ఈ మూవీలో కన్నప్పగా కనిపించబోతున్నారా? లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇందులో మంచు విష్ణు సరసన ప్రీతీ ముఖుందన్ హీరోయిన్‌గా నటించనుంది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Updated : 28 Jan 2024 9:29 PM IST
Tags:    
Next Story
Share it
Top