Salaar Movie OTT Release: గుడ్ న్యూస్ చెప్పిన నెట్‌ఫ్లిక్స్...ఓటీటీలోకి పాన్ ఇండియా హీరో సినిమా
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’ పార్ట్ 1 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను క్రియేట్ చేసింది. శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్ల మార్క్‌ను దాటి ప్రభాస్ ఖాతాలో మరో భారీ హిట్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. వరుస ఫ్లాఫులతో సతమతం అవుతున్న ప్రభాస్.. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఒక శుభవార్త చెప్పింది. జనవరి 20వ తేదీ నుంచి సలార్ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.
ఇప్పటికే పలుమార్లు థియేటర్‌లో సలార్‌ను చూసిన అభిమానులు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 'సలార్'ను జనవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ రోజు అర్థరాత్రి నుంచే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. నిజానికి రిపబ్లిక్ డే నాడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఎవరూ ఊహించిన రీతిలో నెట్‌ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది. ఖాన్సారా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్‌కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టాలెంట్ తోడు కావడంతో ఈ సినిమా బిగ్ హిట్ అందుకుంది.