Home > సినిమా > 50 ఏళ్ల వ‌య‌స్సులో మరోసారి తండ్రైన ప్ర‌భుదేవా

50 ఏళ్ల వ‌య‌స్సులో మరోసారి తండ్రైన ప్ర‌భుదేవా

50 ఏళ్ల వ‌య‌స్సులో మరోసారి తండ్రైన ప్ర‌భుదేవా
X

ప్రభదేవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరియోగ్రాఫర్గా, నటుడిగా, డైరెక్టర్గా ఆయన అందరికీ సుపరిచితమే. తన విలక్షణ డ్యాన్స్‌ మూమెంట్లతో ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 50ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభుదేవా మరోసారి తండ్రి అయినట్లు తెలుస్తోంది. ఆయన రెండో భార్య హిమాని సింగ్ ఆడపిల్లకు జన్మనిచ్చిందని సమాచారం.



మొదటి భార్య రమలతకు 2011లో ప్రభుదేవా విడాకులు ఇచ్చారు. వీరికి ముగ్గురు కొడుకులు కాగా.. పెద్దబ్బాయి 2008లో మరణించాడు. అప్పట్లో నయనతారను ప్రేమించిన ప్రభుదేవా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో రమలత నుంచి విడాకులు కోరగా.. అది పెద్ద దుమారం రేపింది. చివరకు విడాకులు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు నయన్ - ప్రభుదేవా విడిపోయారు.

ఆ తర్వాత సింగిల్గానే ఉన్న ప్రభుదేవా.. 2020లో ఫిజియోథెరపిస్ట్ హిమాని సింగ్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరి బంధం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. అయితే ప్రభుదేవా బర్త్ డే సందర్భంగా ఓ షోలో హిమాని ఓ వీడియో ద్వారా స్పెషల్ విషెస్ చెప్పింది. దీంతో వీరి విషయం అందరికీ తెలిసింది. ఇక సుందరం మాస్టర్ ఇంటికి కొత్త అతిథి రావడంతో సంబురాలు అంబరాన్ని అంటినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుదేవా మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు.




Updated : 11 Jun 2023 6:00 PM IST
Tags:    
Next Story
Share it
Top